ఆంధ్రప్రదేశ్‌

అనుమతులిచ్చి అరెస్టులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: పర్యటనకు అన్ని అనుమతులు తీసుకున్నాం అయినా ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, విపక్షనేత నారా చంద్రబాబునాయుడు పోలీసులను ప్రశ్నించారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం విమానాశ్రయం బయట వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో కాన్వాయ్‌లో తన వాహనంలోనే ఉండిపోయారు. మధ్యాహ్నం మూడుగంటల తరువాత విలేఖరులతో మాట్లాడుతూ పోలీసులు తమపట్ల వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, రూడ్‌గా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకువచ్చి తమ పట్ల దారుణంగా ప్రవర్తించారని ఆందోళన చెందారు. ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని తాను ఏనాడూ చూడనేలేదన్నారు. ముందుగానే పోలీసుల నుంచి అనుమతులు పొందినా కనీసం యాత్ర కూడా సాగని పరిస్థితిలేదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఈ సంఘటనే స్పష్టం చేస్తోందన్నారు. ఇది శాంతి,్భద్రతల వైఫల్యం కాదా? అంటూ పోలీసులను ప్రశ్నించారు. దీనికి పోలీసులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఈ రోజు ఎంత సమయమైనా తాను విశాఖలో పర్యటన కొనసాగించి తీరుతానంటూ శపథం చేశారు. విమానాశ్రయం వద్ద వైసీపీ గుండాలు గుమిగూడితే ఏమీ చేయలేక పోలీసులు చేతులెత్తేస్తారా? అంటూ ఎటువంటి పరిస్థితుల్లోనూ తన పర్యటనను కొనసాగిస్తానంటూ పేర్కొన్నారు. తనను ఎన్‌కౌంటర్ చేసినా ఏమాత్రం వెనక్కి తగ్గనంటూ హెచ్చరించారు.

*చిత్రం... మాజీ ముఖ్యమంత్రి, విపక్షనేత నారా చంద్రబాబునాయుడు