ఆంధ్రప్రదేశ్‌

అమరరాజాకు సీఐఐ జాతీయ హెచ్‌ఆర్ ఎక్స్‌లెన్స్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 27: మంగళ్ ఇండస్ట్రీస్ (అమరరాజా గ్రూప్ కంపెనీ) ప్రతిష్టాత్మకమైన 10వ జాతీయ హెచ్‌ఆర్ ఎక్స్‌లెన్స్ అవార్డు 2019-20ని అందుకుంది. సీఐఐ నేషనల్ కమిటీ ఆన్ లీడర్‌షిప్ అండ్ హెచ్‌ఆర్ చైర్మన్ సంజయ్‌భెల్, సీఐఐ హెడ్ ఇంద్రాణి కర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న సందర్భంగా అమరరాజా గ్రూప్ హెచ్‌ఆర్ అండ్ న్యూ బిజినెస్ డెవలప్‌మెంట్ ప్రెసిడెంట్ జైకృష్ణ బీ మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. అమరరాజా వే పట్ల తమకున్న నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని చెప్పారు. మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎండీ హర్ష గౌరినేని మాట్లాడుతూ ఉద్యోగుల కేంద్రీకృత హెచ్‌ఆర్ ప్రక్రియలు ద్వారా తాము కంపెనీ వ్యాపార, సామాజిక లక్ష్యాలను చేరుకోగలమన్నారు.
*చిత్రం... మంగళ్ ఇండస్ట్రీకి 2019-20గానూ 10వ సీఐఐ జాతీయ హెచ్ ఆర్ ఎక్సలెన్స్ అవార్డు