ఆంధ్రప్రదేశ్‌

మల్లన్న సన్నిధిలో సౌభాగ్యమస్తు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 27: శ్రీశైలం మహాక్షేత్రంలో పెళ్లి చేసుకున్న నూతన వధూవరులకు ప్రత్యేకంగా సౌభాగ్యమస్తు పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టినట్లు దేవస్థానం ఈఓ రామారావు తెలిపారు. ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకున్న నవ వధూవరులు, వారి బంధువులకు స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం, అర్చకులతో ఆశీర్వచనం అందజేస్తామన్నారు. స్వామివారి ప్రసాదాలు, నూతన వధూవరులకు అమ్మవారి శేషవస్త్రంగా రవిక, పసుపుకుంకుమ, గాజులు అందజేస్తామన్నారు. సౌభాగ్యమస్తు పథకం ప్రారంభం సందర్భంగా గురువారం మొదటి జంట గుంటూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన పి.సురేష్, సాహితి నూతన వధూవరులకు ఆర్చకులు ఆశీర్వచనాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకస్వాములు, వేదపండితులు, అలయ అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం...సౌభాగ్యమస్తు పథకం ప్రారంభం సందర్భంగా గుంటూరుకు చెందిన
నూతన వధూవరులకు స్వామివారి ప్రసాదం అందజేస్తున్న ఈఓ రామారావు