ఆంధ్రప్రదేశ్‌

సమయపాలనతో ముందుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 27: నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసి, సమయపాలనతో ముందుకు వెళ్లాలని అధికారులను ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అధికారులతో గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వేగంగా, కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. నైపుణ్య విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించడం, డిజైన్లు తదితర అంశాల్లో సమయపాలన పాటించాలని కోరారు. ఎన్‌ఎఫ్‌డీసీ రుణాలు, నిధుల సమీకరణ, నిధుల వేట నిత్యం జరిగే ప్రక్రియ అని, రాజీపడకుండా నిధుల సమీకరణ చేయాలని కోరారు. రంగాల వారీగా ఉన్న డిమాండ్, ఉద్యోగాలు, విద్యార్థులు ఆశించే కోర్సులను పక్కా ప్రణాళికతో రూపొందించాలన్నారు. 25 స్కిల్ డెవలప్‌మెంట్ కళాశాలలు, 2 వర్సిటీల ఏర్పాటుకు అవసరమైన నిధులను కేంద్రం ద్వారా వీలైనంత ఎక్కువ రాబట్టాలని కోరారు. ల్యాబ్ ఎక్విప్‌మెంట్, బోధన, ఉపాధ్యాయుల నియామకం, భాగస్వామ్యం, ఒప్పందాలు, బ్రాండింగ్, తదితర అంశాలపై అధికారులతో చర్చలు జరిపారు.
అనంతరం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చేపడుతున్న నైపుణ్య కార్యక్రమాలపై ఏర్పాటైన కమిటీ సమావేశం కూడా జరిగింది. 8 వారాల్లో నివేదిక రూపొందించాలని కోరారు. ఈ సమీక్షలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, డైరక్టర్ లావణ్య వేణి తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి