ఆంధ్రప్రదేశ్‌

ప్రజలకు మరింత చేరువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: ప్రపంచ వ్యాప్తంగా పరిపాలన తీరుతెన్నులు మారుతున్నాయి. నియంత్రించే విధానం నుంచి సాధికారిత కల్పించే దిశగా పాలనా విధానాలు మార్పుకు లోనవుతున్నాయి. ప్రజలకు సంతృప్తి కలిగించేలా పాలనాపరమైన సంస్కరణలకు ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నిర్వహించిన రెవెన్యూ డివిజనల్ అధికార్ల, డిఎస్‌పిల రాష్ట్ర స్థాయి సమావేశంలో అర్థవంతమైన పరిపాలన ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడంపై తమ అభిప్రాయాలను వివరించి వాటిపై సూచనలు చేయాల్సిందిగా అధికార్లను ముఖ్యమంత్రి కోరారు. సంక్షేమ పథకాలు పూర్తి పారదర్శకతతో అమలు కావాలని, నియంత్రణకు సంబంధించిన పాలన వీలున్నంత మృదువుగా ఉండాలని, ప్రజల్లో, అధికార్లతో విషయ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలని తద్వారా రాష్ట్రంలో వృద్ధిరేటు 15 శాతం సాధించాలని ముఖ్యమంత్రి అధికార్లకు సూచించారు. విషయ పరిజ్ఞానం, సంపద, ఆరోగ్యం, సంతోషం వంటి అనుకూల అంశాలను ప్రజలకు సమర్ధవంతంగా అందించేందుకు ప్రస్తుతం వున్న పాలనా పద్ధతులలో తేవాల్సిన సంస్కరణపై తగు సూచనలు చేయాలన్నారు. నెలకు రూ. 10 వేల కంటే ఆదాయం వున్న జనాభా రాష్ట్రంలో 20 శాతం వున్నారని, వీరందరికీ ఆదాయం పెంచి, మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు వినూత్న ఆలోచనలతో అధికారులు ముందుకు రావాలన్నారు. రాష్ట్రంలో వనరులకు కోరత లేదన్నారు. ఖనిజ సంపద, కష్టించి పని చేసే వ్యక్తులకు కోదవలేదన్నారు. గూగుల్ సంస్థ వినూత్న పద్ధతుల నిర్వహణ కోసం 20మందిని ఎంపిక చేయగా అందులో 13 మంది తెలుగువారే కావడం విశేషమన్నారు. ఇంతటి తెలివితేటలు, నైపుణ్యం వున్న మానవవనరులు మన సొంతమన్నారు. రాష్ట్రంలో సంపద వృద్ధి గమనిస్తే, అత్యధిక సంపదను ఆర్జించే తొలి పది నియోజకవర్గాలు ప్రాథమిక రంగం (వ్యవసాయ, అనుబంధ రంగాలు)లో 14.5 శాతం వృద్ధి రేటు ఉండగా, అత్యల్పంగా సంపదను సృష్టించే చివరి 10 నియోజకవర్గాల్లో 1.4 శాతం వృద్ధిరేటు ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితాలు పేదలకు చేరవేయడంలో రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ తగాదాలు, భూమి తగాదాల సంఖ్య పెరుగుతోందన్నారు. ఈ సమస్యలు శాంతి భద్రతల సమస్యగా మారకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, డిజిపి నండూరి సాంబశివరావు, భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఎసి పునేటిలు ప్రసంగించారు. రాష్ట్రంలోని 51 రెవెన్యూ డివిజన్‌లకు చెందిన ఆర్‌డిఓలు, డిఎస్‌పిలు సమావేశంలో పాల్గొన్నారు.

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు