ఆంధ్రప్రదేశ్‌

తిరుమల అడవుల్లో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మార్చి 26: తిరుమల కాలినడక మార్గంలో ఉన్న నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న శేషాచల అడవుల్లో శనివారం మరోసారి అటవీసంపద అగ్ని పాలైంది. శుక్రవారం జింకలపార్కు వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు ఎకరాలు అగ్నికి ఆహుతైనట్లు మంటలను ఆర్పిన సిబ్బంది తెలిపారు. ఆప్రమాదం జరిగి 24 గంటలు గడువక ముందే మరోమారు అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది అరగంటలోనే మంటలను అదుపుచేశారు. సుమారు ఒక ఎకరా మేర అటవీసంపద అగ్నికి ఆహుతైనట్లు అంచనావేస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని తిరుమల జె ఇ ఒ శ్రీనిసరాజు శనివారం ఉదయం వెళ్ళి పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ తిరిగి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటు అలిపిరి, అటు శ్రీవారి మెట్టు కాలినడక మార్గాలు ఉండటంతో భక్తులకు తిరుమలకు వెడుతుంటారని ఈప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈనేపథ్యంలో అటవీశాఖ, అగ్నిమాపక సిబ్బంది తగు ప్రణాళికలు రూపొందించుకుని మంటలు ఎక్కువగా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు.