ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: ‘నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, నాకు రహస్య ఎజెండా ఏదీ లేదు. వితండవాదం అంతకన్నా లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తన ముందున్నది ఒక్కటే లక్ష్యమన్నారు. హోదాకు సమానంగా ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత కావాలి, అందుకు అవసరమైన జీవోలు ఇవ్వాలి, అన్నీ రిలీజ్ చేయాలి, ఇదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి గురువారం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కావాలి, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందుకే కేంద్రం ఇచ్చిన అన్ని తీసుకుంటున్నామని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అన్నారు. కేంద్రం ఇచ్చినవన్నీ తీసుకునేటప్పుడు ఎందుకు బాధ అని అన్నారు. ఇంకా చట్టబద్ధత కల్పించమని చెప్పవచ్చు. తాను సంతోషపడతానన్నారు. కావాలంటే హోదా కావాలని, ఇవ్వమని కూడా చెప్పవచ్చని, తాను కూడా పోరాడతానన్నారు. ఇదే విషయాన్ని తాను కౌన్సిల్‌లో చెప్పానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఒక్కటే ముఖ్యమని, తనకు ఎలాంటి రహస్య ఎజెండా లేదన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తాను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, హోదాతో సమానంగా అన్ని ఇస్తామని తెలిపారన్నారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రం నష్టపోయిందని ఇప్పటికైనా ముందుకు పోవాలని సూచించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి పరిశ్రమల పెట్టుబడులు 15.8 శాతం వచ్చాయని, ఇది అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు. దేశంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల కంటే మన రాష్ట్రానికే ఎక్కువ పెట్టుబడులు రావడానికి మన ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయతే కారణమన్నారు. తనకు రాష్ట్ర భవిష్యత్, పిల్లల భవిష్యత్ ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కొన్ని విషయాల్లో అవగాహనకు వచ్చామన్నారు. ఆంధ్రాకు 512 టిఎంసిలు, తెలంగాణ 299 టిఎంసిలు పంచుకోవాలని, ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయని, విబేధాలు లేకుండా అవగాహనతో ముందుకెళ్లాలని చెప్పానన్నారు. ప్రాజెక్టుల నీటి వినియోగంపై రెండు రాష్ట్ర పర్యవేక్షణ కాకుండా కేంద్రం పర్యవేక్షణ ఉండాలని తాము కోరామని, కానీ రెండు రాష్ట్రాల అధికారుల పర్యవేక్షణ ఉండే విధంగా అవగాహనకు వచ్చామని తెలిపారు. కృష్ణా నదిపై దామాషా ప్రకారం వచ్చిన నీటిని పంచుకునే పరిస్థితి రావాలని, దానిపైనే తాము డిమాండ్ చేశామని తెలిపారు. కృష్ణానదిలో ఆంధ్ర, తెలంగాణ ఎవరి వాటా ఎంతో నిర్ణయిస్తే ఆ ప్రకారమే నీటిని వాడుకుంటామని చంద్రబాబు అన్నారు. ఇదే విషయాన్ని అపెక్స్ కౌన్సిల్ ముందు ఉంచామన్నారు.