ఆంధ్రప్రదేశ్‌

ఇంధన పొదుపునకు ఐదేళ్లలో ఐదు వేల కోట్ల రూపాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఇంధన పొదుపు కార్యక్రమానికి ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టేందుకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి తెలిపారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. జాతీయ స్థాయిలో 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేసేందుకు, ఇంధన పొదుపు కార్యక్రమాలను అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శరాష్ట్రంగా ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి తెలియ చేశారు. రాష్ట్ర స్ధాయిలో ఎల్‌ఇడి బల్బుల విధానాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రీకృత కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. 110 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఎల్‌ఇడి బల్బుల కార్యక్రమాన్ని చురుకుగా అమలు చేస్తున్నారు. విజయవాడలో సెంట్రలైజ్డ్ కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. రాష్టవ్య్రాప్తంగా ఎల్‌ఇడి బల్బులను అమర్చి, వేరే బల్బులను మార్చేందుకు 160 సెంటర్లు ఏర్పాటు చేశామని అన్ని పనిదినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పనిచేస్తాయని అజయ్ జైన్ తెలిపారు.