రాష్ట్రీయం

తెలుగు భాషా ఉద్యమానికి గొంతునవుతా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 15: తెలుగు భాషా పరిరక్షణకు మేధావులు, భాషాభిమానులు జరిపే ఉద్యమానికి తను గొంతునవుతానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమానికి వేదికనవుతానన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రారంభించిన ‘మన నుడి-మన నది’ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం తెలుగు వైభవం పేరిట నిర్వహించిన తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమానికి చారిత్రక రాజమహేంద్రవరం నుంచి శ్రీకారం చుట్టామన్నారు. మేధావులు, పండితులు, కవులు, తెలుగు భాషాభిమానులు ఇచ్చిన సూచనలు, సలహాలతో చైతన్యవంతమైన ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు. తెలుగు భాషా మాధుర్యాన్ని ఆస్వాదించే పరిస్థితిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. భాషను మర్చిపోతే, సంస్కృతిని మర్చిపోయిననట్టేనన్నారు. తెలుగును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ‘మన నుడి-మన నది’ కార్యక్రమం కొంతమంది మేధావుల మేధోమథనం నుంచి ఉద్భవించిందన్నారు. రాజమహేంద్రవరంలోని నిర్వహించిన ఈ సదస్సులో చాలా విలువైన సూచనలు వచ్చాయని, వాటిని అమలుచేస్తూ ఉద్యమిస్తామన్నారు. పలుకుబడి అనే వినూత్న కార్యక్రమం ద్వారా భాషా సౌందర్యాన్ని కాపాడటానికి ఒక ప్రత్యేక కార్యశాల నిర్వహించాలని తెలుగు పండిట్ కామేశ్వరి నుంచి వచ్చిన సూచన బాగుందన్నారు. ప్రతీ జిల్లాకు జనసేన పార్టీ తరపున తెలుగు భాషా పరిరక్షణ కమిటీలు ఏర్పాటుచేస్తామన్నారు. ఈ కమిటీల్లో భాషా పండితుల నుంచి ఐదుగురు, పార్టీ పరంగా ముగ్గురు చొప్పున ఉంటారన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 39 నదీ పరీవాహక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
*చిత్రం... సదస్సులో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్