ఆంధ్రప్రదేశ్‌

బెంగళూరులో తెలుగోడి గోడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, మార్చి 17: ఇటుకలు మోసే రామక్క, నిర్మాణం పనులు చేసే మేస్ర్తి ఓబుళేసు, రోడ్లు ఊడ్చే సాలెమ్మ, సోడా అమ్మే రాములు, కొబ్బరి బోండాం అమ్మే హనుమంతు, బట్టలు కుట్టే నసీమా, రాళ్లు కొట్టే చంద్ర, హోటల్‌లో టీ అందించే బా షా ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ... బెంగళూరు మహానగరంలో ఎక్కడ చూసినా రాయలసీమ వాసులు ముఖ్యం గా అనంతపురం జిల్లా వాసులే కనిపిస్తుంటారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కర్నాటక రాజధాని బెంగళూరుకు సైతం వ్యాపించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడి వ్యాపార, వాణి జ్య సంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కంపెనీలకు సెల వు ప్రకటించారు. దీంతో పొట్టచేతపట్టుకుని పనికోసం బెంగళూరు వెళ్లిన వలసజీవులు ఉసూరుమంటూ సూంతూళ్లకు తిరిగొస్తున్నారు. నిత్యం వ్యాపారాలు, ట్రాఫిక్ తో కళకళలాడే బెంగళూరు నగరం ప్రస్తుతం వెలవెలబోతోంది. దీంతో పనికోసం వెళ్లిన వేలాదిమంది అనంతపురం జిల్లా వాసులు చేసేందుకు పనిలేక బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి.
అనంతపురం జిల్లాలోని హిందూపు రం, గోరంట్ల, కదిరి, ధర్మవరం, రాయదుర్గం, కొత్తచెరువు, నల్లమాడ, బుక్కపట్నం, ముదిగుబ్బ, పుట్టపర్తి, పెనుకొండ, చెనే్నకొత్తపల్లి, మడకశిర తదితర ప్రాంతా ల నుంచేగాక రాయలసీమలోని కర్నూ లు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి కూడా బతుకుతెరువు కోసం అత్యధిక సంఖ్యలో జనాలు బెంగళూరుకు వలస వెళ్తున్నారు. పెద్దపెద్ద ఐటీ కంపెనీల్లో లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల నుంచి అంతో ఇంతో చదువుకున్న వారు అపార్ట్‌మెంట్ల వద్ద వాచ్‌మెన్లుగా, రోడ్లపై చిరువ్యాపారాలు చేసుకునే వారు, దినసరి కూలీలు ఇలా ఎవరికి తోచిన పని వారు వెతుక్కుంటూ నాలుగు డబ్బులు సంపాదించి పిల్లాపాపలను సాకుతున్నారు. బెంగళూరులోని యలహంక, ఎలక్ట్రానిక్ సిటీ, సిరిపోడు, హంగసంద్ర, బ్యాంక్ కాలనీ, హొస్కెరహళ్ళి, తోగూరు, సింగసంద్ర, మత్తికెర, హెబ్బల్, మార్తళ్ళి, సిల్క్‌బోర్డు ప్రాంతాల్లో ఎక్కువ మంది రాయలసీమ జిల్లాల కూలీలే కనిపిస్తుంటారు. వీరిలో ఎవరిని కదిలించినా వేసిన పంటలు చేతికి రాక, చేసిన వ్యాపారాల్లో నష్టాలు రావడం వల్ల, సొంతూళ్లలో చేసేందుకు పనులు లేక, చేసిన అప్పులు తీర్చడం కోసం అని కొందరు, పిల్లల చదువుల కోసం తప్పదని మరికొందరు ఇలా కూలీపనులు, రోడ్‌సైడ్ వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలకు దూరంగా ఉంటూ పొట్టకూటి కోసం బెంగళూరు చేరుకుని రాత్రీపగలూ శ్రమిస్తున్నారు. పగలంతా కష్టపడి రాత్రి సమయాల్లో ఎక్కడ పడితే అక్కడ ఖాళీ ప్రదేశాల్లో కాసేపు కునుకుతీయడం, తిరిగి ఉదయానే్న ఏదో ఒక పని వెతుక్కోవడం ఇదీ వలసజీవుల దినచర్య.
అయితే ప్రస్తుతం కోవిడ్-19 కర్నాటకకూ సోకడంతో వలసజీవుల బతుకుతెరువు బెంగళూరు మహానగరంలో కష్టంగా మారుతోంది. పెద్దపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే వారు తమ పిల్లల్ని వారి సొంతూళ్లల్లో వదిలేసి బెంగళూరులో ఇళ్ల నుంచే ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. పెద్దపెద్ద అపార్ట్‌మెంట్ల వద్ద సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేవారు బిక్కుబిక్కుమంటూ పని చేసుకుంటున్నారు. ఇతర దేశాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరుకు నిరంతరం వచ్చిపోయేవారి సంఖ్య తగ్గింది. ప్రధాన దారుల్లోనే కాకుండా చిన్నచిన్న దారుల్లో కూడా అనునిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా వుండే రోడ్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. దీంతో వలసజీవులు రోడ్లపై కొనసాగిస్తున్న చిన్నచిన్న వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితిల్లో ఎక్కువ శాతం మంది తిరిగి సొంతూళ్లకు చేరుకుంటున్నారు.

*చిత్రం...జన సంచారం లేక నిర్మానుష్యంగా బెంగళూరు మహానగరంలోని రహదారులు