ఆంధ్రప్రదేశ్‌

వ్యవస్థలోని వ్యక్తులు తప్పుచేస్తే ప్రశ్నిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 17: వ్యవస్థలో ఉన్న వ్యక్తులు తప్పుచేస్తే ప్రశ్నించే అధికారం తమకు ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ స్థాయి పెంచేలా కమిషనర్ వ్యవహరించాలే తప్ప సొంత అభిప్రాయాలతో ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకూడదన్నారు. ఆరువారాల తర్వాత కరోనా అంతరించిపోతుందని ఎన్నికల కమిషనర్ ఎలా అంచనాకు వచ్చారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా ఎవరికీ సోకలేదని, చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పుతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిందని, అందుకే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషనర్ స్వయంప్రతిపత్తి అంటే తనకు ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడం కాదని, ప్రజలకు అవసరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ అని వ్యవసాయంలో పంటలు ఎండిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి, సీఎంకు కూడా విచక్షణాధికారాలు ఉంటాయని గుర్తించాలన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పందన కార్యక్రమాన్ని చేపట్టారని, ఇది ఎంతో ప్రజాదరణ పొందిందని, ఎన్నికల కోడ్ వల్ల దాన్ని నిలిపివేశారన్నారు. సామాన్యులకు కష్టంవస్తే నేడు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్‌కు రాజకీయాలు సరిపడవని, సినిమాలు చేసుకోవాలని సూచించారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబుని ప్రశ్నించాల్సిందిపోయి బీసీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న జగన్‌ను పవన్ ప్రశ్నిస్తున్నారన్నారు. ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినదే అంతిమ తీర్పు అని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.