ఆంధ్రప్రదేశ్‌

బెదిరింపు కాల్స్ వస్తున్నాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: దేశంలో కరోనా విజృంభణ ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం వెలువడిన సుప్రీం కోర్టు తీర్పును రాజకీయ నాయకులు ఎవరికి వారు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఎన్నికల వాయిదాను విపక్షాలు, ఎన్నికల కోడ్ ఎత్తివేతను అధికార పక్షం స్వాగతిస్తున్నాయి. మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ తాను నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుంచి తనకు, తన కుటుంబానికి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, తక్షణం తమకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రక్షణ కల్పించాలని కూడా కోరారు. ఏ క్షణాన
అయినా తన కుటుంబ సభ్యులతో పాటు తనపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచినప్పటికీ అభ్యర్థి వద్ద మద్యం, డబ్బు దొరికితే మూడేళ్ల జైలుశిక్ష, అనర్హత వేటువేస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్రూరమైన ఆర్డినెన్స్ తెచ్చిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సక్రమంగా విధులు నిర్వహించలేక పోతున్నారని తెలిపారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని పేర్కొన్నారు. అందుకే తనకు తగిన భద్రత కల్పించటంతో పాటు ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాలని కోరారు. ఎన్నికల ఫలితాలపై మంత్రులకు సీఎం టార్గెట్ పెట్టడాన్ని కూడా రమేష్‌కుమార్ తన లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జరిగిన ఏకగ్రీవాల గురించి కూడా ప్రస్తావిస్తూ ఇప్పటికే 24శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కేవలం ఒకే ఒక్క జెడ్పీటీసీ ఏకగ్రీవమైతే నేడు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 126 జెడ్పీటీసీలు ఏకగ్రీవం కావటాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఒక్క వైఎస్‌ఆర్ కడప జిల్లాలోనే 79శాతం ఎంపీటీసీలు, 75శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని కూడా లేఖలో రమేష్‌కుమార్ వివరించినట్లు తెలిసింది. కేంద్రానికి లేఖ రాసిన తరవాత ఆయన హైదరాబాద్‌కు పయనమయ్యారు.