ఆంధ్రప్రదేశ్‌

31 వరకూ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ వ్యాప్తి కట్టడికి ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. గురువారం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించింది. కరోనా ప్రభావం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. విద్య, వైద్య శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 31వరకూ విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అనంతరం పరిస్థితిని సమీక్షించి సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించింది.
పాఠశాలల వార్షికోత్సవాలకు నో!
కరోనా (కోవిడ్-19) వైరస్ ప్రభావం నేపథ్యంలో పాఠశాలల వార్షికోత్సవాల నిర్వహణను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు వార్షికోత్సవాల నిర్వహణలో భాగంగా విద్యార్థులతో డ్యాన్స్ రిహార్సల్స్ చేయిస్తున్నట్లు విద్యాశాఖ దృష్టికి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల వార్షికోత్సవాల నిర్వహణను రద్దు చేసింది. ఇది ప్రైవేట్, అన్-ఎయిడెడ్ పాఠశాలలకూ వర్తిస్తుంది. పాఠశాలల వార్షికోత్సవాల నిర్వహణనే రద్దు చేసిన నేపథ్యంలో డ్యాన్సులు, డ్రామాలకు రిహార్సల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. తల్లితండ్రుల సమావేశాలు, వివిధ పోటీలు వంటి గ్రూపు కార్యక్రమాలు నిర్వహించవద్దని, ఎగ్జిబిషన్లు, సమావేశాల వంటివాటికి పిల్లలను పంపవద్దని తల్లితండ్రులకు సూచించింది. అవసరమైతే తప్ప బస్సుల్లో, రైళ్లలో పిల్లలతో ప్రయాణం చేయవద్దని తెలిపింది. ఈ ఉత్తర్వులు అమలు జరిగేలా జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.