ఆంధ్రప్రదేశ్‌

వసతిగృహాలు, విద్యాలయాలన్నీ మూసేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కరోనా వైరస్ నియంత్రణకు ముందుజాగ్రత్త చర్యలుగా అన్ని విద్యా సంస్థలను, వసతిగృహాలను ఈ నెల 31వరకూ మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 వైరస్ నివారణకు ముందుజాగ్రత్త చర్యలపై వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో బుధవారం ఆమె సమీక్షించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు
నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు కోచింగ్ కేంద్రాలు, శిక్షణ కేంద్రాల వంటివి అన్నీ మూసివేయాలన్నారు. 10మందికి మించి ప్రజలు ఒకచోట గుమికూడకుండా చూడాలన్నారు. మనిషికి, మనిషికి మధ్య ఒక మీటరు దూరం ఉండేలా చూసుకోవాలన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో నిరంతరం శానిటైజేషన్ ప్రొటోకాల్‌ను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్లు, సంతలు, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాల వద్ద ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలన్నారు. రానున్న 15రోజులు అత్యంత కీలకంగా భావించి, అన్నిరకాల జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని కోరారు. సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ