ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం జిల్లాలో 41 కోవిడ్ పాజిటివ్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 13: ప్రకాశం జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 41 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎక్కువగా జిల్లాకేంద్రమైన ఒంగోలులోనే 25 కేసులు నమోదు కావటంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా ముస్లింలు ఎక్కువగా నివసించే ఇస్లాంపేటలోనే కోవిడ్ కేసులు నమోదుకావడంతో ఆ ప్రాంతంలో జిల్లాయంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. జిల్లాలోని చీరాలలో 5, కందుకూరులో 3, చీమకుర్తిలో 1, కనిగిరిలో 1, మార్కాపురంలో 1, కారంచేడులో 4, కొనకనమిట్లలో ఒక కోవిడ్ కేసు నమోదైంది. కాగా సోమవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, 29మందికి కోవిడ్ నెగెటివ్ వచ్చినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. కోవిడ్ బాధితులను జిల్లా యంత్రాంగం ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. కొంతమంది క్వారైంటైన్‌లో ఉన్నారు. జిల్లాలోని ఒంగోలు, చీరాల, కారంచేడు, కందుకూరు ప్రాంతాలను రెడ్‌జోన్లుగా, కనిగిరి, కొరిశపాడు, మార్కాపురం, పొదిలి ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించినట్లు తెలుస్తోంది.