ఆంధ్రప్రదేశ్‌

హిందూపురంలో బయో కెమికల్ టనె్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, ఏప్రిల్ 13: కరోనా కట్టడి కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని మూడు ప్రాంతాల్లో సోమవారం బయోటనె్నల్స్‌ను ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన టనె్నల్‌ను సబ్ కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రం ప్రాజెక్టు సుగర్దన తరపున డాక్టర్ కార్తీక్ నారాయణ్ సహకారంతో బయో క్రిమి సంహారక టనె్నల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నాటకలోని గౌరిబిదనూరులో డాక్టర్ కార్తీక్ నారాయణ సహకారంతో బయో టనె్నల్‌ను ప్రారంభించినట్లు అక్కడి అధికారులు చెప్పడం, దీని ద్వారా మంచి ఫలితాలు రావడంతో ఆ ప్రయోగాన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి, ఎంజీఎం మైదానం, సప్తగిరి కళాశాల వద్ద వీటిని ఏర్పాటు చేశామన్నారు. తమిళనాడులోని తిరుప్పడి జిల్లాలో తొలిసారి దీన్ని ప్రారంభించారని తెలిపారు.