ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు జిల్లాలో 55కు చేరిన కరోనా బాధితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 13: నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ గల బాధితుల సంఖ్య సోమవారం సాయంత్రానికి 55కు చేరింది. సోమవారం తాజాగా నాలుగు కేసులు వెలుగుచూడటంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌కు గురైన బాధితుల సంఖ్య 55కు చేరినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి వెల్లడించారు. సోమవారం 32 మంది నమూనాలను సేకరించి పరీక్షకు పంపగా, వారిలో నలుగురు పాజిటివ్‌గా తేలారు. జిల్లాలో ఇప్పటి వరకు 721 మంది నమూనాలను పరీక్షలకు పంపించడం జరిగిందని వారిలో 619 మందికి కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చిందని ఆమె తెలిపారు. మరో 47 మందికి సంబంధించి ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో 53 మంది ఉన్నారని, ఒకరు వ్యాధి తగ్గి డిశార్చి అయినట్టు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 203మంది స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు.