ఆంధ్రప్రదేశ్‌

మైనార్టీలపై వైసీపీ ప్రభుత్వానికి చిన్నచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 13: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి మైనార్టీలపై అక్కసు వెళ్లగక్కుతూ అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. సోమవారం మంగళగిరి సమీపంలోని టీడీపీ జాతీయ కార్యాలయం నుండి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మైనార్టీలను కించపరిచేలా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ముస్లింలు ప్రభుత్వానికి సహకరించడం లేదనడం దుర్మార్గమన్నారు. మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నాడు శాసనమండలి చైర్మన్ షరీఫ్‌ను సాక్షాత్తూ సభలోనే మంత్రులు అవమానించి ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. ముస్లింలకు జరిగిన అవమానానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని కళావెంకట్రావు డిమాండ్ చేశారు.