ఆంధ్రప్రదేశ్‌

కరోనాపై సీఎం చర్యలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 13: కరోనా మహమ్మారి నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న చర్యలపై ప్రజలు పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, మరో ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని, ప్రతి నియోజకవర్గంలో టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా, వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశాల్లో మాట్లాడారు. రాష్టవ్య్రాప్తంగా 5.3 కోట్ల మందికి మాస్క్‌లు పంపిణీ చేసేందుకు సీఎం చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇందుకోసం 16కోట్ల మాస్క్‌లను సిద్ధం చేశారన్నారు. ఇప్పటికే కరోనా కట్టడికి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ఇదంతా మరచిన ప్రతిపక్షం కరోనా పేరుతో కుటిల రాజకీయాలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కరోనా పేరుతో ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కావాలని బురద జల్లుతున్నారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సలహాలు అందించడం మాని, నీచ రాజకీయాలు చేయడం టీడీపీ నేతలకే చెల్లిందన్నారు. సీనియర్ న్యాయమూర్తి కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వరుసగా ప్రెస్‌మీట్‌లు పెట్టి విమర్శిస్తూ దళితులను అవమానపరుస్తున్నారని విమర్శించారు.