ఆంధ్రప్రదేశ్‌

గుత్తి క్వారంటైన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, ఏప్రిల్ 13: అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని ఎస్కేడి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గడువు ముగిసినందున తమను ఇళ్లకు పంపాలంటూ క్వారంటైన్ సెంటర్‌లో ఉన్న వలస కూలీలు పోలీసులపై తిరగబడి రాళ్లురువ్వారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్కేడి ఇంజనీరింగ్ కళాశాలలోని క్వారంటైన్ సెంటర్‌కు చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు చెందిన వలస కూలీలు సుమారు 200 మందిని అధికారులు తరలించారు. ప్రారంభంలో జిల్లాకు చెందిన కొంతమందిని ఇళ్లకు తరలించి స్వీయ నియంత్రణలో ఉండాలని ఆదేశించారు. మిగిలిన వారు అక్కడే ఉన్నారు. సోమవారంతో 14 రోజుల క్వారంటైన్ గడువు ముగిసిందని, తమకు స్వస్థలాలకు పంపాలని కూలీలు ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజనం తినకుండా బైఠాయించారు. అక్కడ విధుల్లో వున్న పోలీసులు ఇతర సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. చిత్తూరు, శ్రీకాకుళంకు చెందిన కొందరు యువకులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ కళాశాల గేట్లు తోసుకుంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో బందోబస్తు పోలీసులు వారిని అడ్డుకున్నారు. కోపోద్రిక్తులైన కూలీలు పోలీసులపై రాళ్లురువ్వారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అక్కడకు చేరుకున్న తహసీల్దార్ బ్రహ్మయ్య, సీఐ రాజశేఖర్‌రెడ్డి వారికి నచ్చజెప్పారు. ఉన్నతాధికారులు అనుమతిస్తే రాత్రికి రాత్రే ఇళ్లకు తరలిస్తామని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుని సబ్ జైలుకు తరలిస్తామని హెచ్చరించారు. దీంతో కూలీలు శాంతించారు.

*చిత్రం... గేట్లు తోసుకుని బయటకు వస్తున్న వలస కూలీలను అడ్డుకుంటున్న పోలీసులు