ఆంధ్రప్రదేశ్‌

క్షుద్ర రాజకీయాలు మానుకో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 13: పనీపాటా లేని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను అనుచితంగా విమర్శిస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా దేవినేని క్షుద్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. సోమవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుండి, ఆ నేతల నుండి నిర్మాణాత్మకంగా కనీసం ఒక్క సూచన, ఒక్క సలహా కూడా రాలేదన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నిరకాల చర్యలు తీసుకున్నారన్నారు. ఇదే విషయమై జాతీయ స్థాయి మీడియా సైతం ప్రస్తావించిందన్నారు. నిత్యావసర వస్తువులు, సరుకులు, కూరగాయలు, అవసరమైన అన్నింటినీ పేదలకు అందిస్తున్నామని తెలిపారు. అయితే ఇవేమీ కనపడని దేవినేని ఉమా వంటి నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారి ప్రభుత్వంపై పదేపదే కువిమర్శలు చేస్తున్నారన్నారు. పేదలకు సహాయం చేయదలచుకుంటే రేషన్ షాపుల వద్ద ప్రజలను ఆదుకునేలా వారి కార్యకర్తలను నియమించాలని సూచించారు. ఎదుటివారిని విమర్శించేటప్పుడు వారి లోతుపాతులు తెలుసుకోవాలన్నారు. మంత్రుల శాఖల కేటాయింపుపై ప్రశ్నించే టీడీపీ నేతలు లోకేష్‌కు ఏ అర్హత ఉందని ఐటీ, పంచాయతీ శాఖల మంత్రిగా నాడు నియమించారని వసంత ప్రశ్నించారు.
*చిత్రం... ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్