ఆంధ్రప్రదేశ్‌

తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సరుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, ఏప్రిల్ 13: రాష్ట్రంలోని కోటీ 40లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అందుతాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పూర్తి స్టాక్ ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. విజయవాడ నగర శివారు కానూరు పరిధిలోని అశోక్‌నగర్‌లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో కోటీ 40 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉండగా, 92లక్షల తెల్లకార్డుదారులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. దానికి సరిపడా సరుకులను అందించిందని, 55లక్షల కార్డుదారులకు రాష్ట్ర ప్రభుమే రేషన్ సరుకులు అందిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా మూడుసార్లు 5కేజీల చొప్పున ఉచితంగా పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. 55లక్షల మంది కార్డుదారులకు రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి తెలియచేశామన్నారు. కేంద్రం నుండి 2వేల కోట్లు నిధులు రావలసి ఉందని, ముఖ్యమంత్రి సహాయ నిధి నిధుల నుండి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిధులు ఇచ్చారన్నారు. 16 నుండి రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభం అవుతుందని, 23,700 రేషన్ షాపులను పంపిణీకి సిద్ధం చేశామన్నారు. 14వేల రేషన్ షాపులను అదనంగా ఏర్పాటు చేసి అందరికీ అందేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కూపన్ల పద్ధతి ద్వారా రేషన్ ఎప్పుడు ఇచ్చేది సమయం, రోజు ముద్రించి ఉందన్నారు. ఆ సమయానికి రేషన్ షాపుకి వెళ్లి తెచ్చుకోవాలని సూచించారు. కూపన్లు గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అందరికి అందచేస్తారని, ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదన్నారు. 5కేజీల బియ్యం, కేజీ శనగలు అందిస్తారన్నారు. మే నెలకు బియ్యం, కందిపప్పు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పౌర సరఫరాల శాఖ ఎండీ, డీఎం సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, వలంటీర్లు కరోనా సమయంలో కూడా కష్టపడి పనిచేస్తున్నారని మంత్రి కొడాలి అభినందించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్, మేనేజింగ్ డైరెక్టర్ ఏ సూర్యకుమారి, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ కాంతారావు పాల్గొన్నారు.
రైతులకు విన్నపం
రాష్ట్రంలో 56లక్షల మంది రైతులు ధాన్యాన్ని పండిస్తున్నారని, 33లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లో ఉందని ఈసందర్భంగా మంత్రి కొడాలి నాని తెలిపారు. 57 మెట్రిక్ టన్నుల ధాన్యం వ్యవసాయ శాఖ అధికారులు సేకరించి పెట్టారన్నారు. రైతులు ధాన్యం కుప్పలు నూర్చగానే ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని కోరారు. ధాన్యం ఎలా ఉన్నా ప్రభుత్వం గిట్టుబాటు ధరతో తీసుకుంటుందని మంత్రి కొడాలి భరోసా ఇచ్చారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని