ఆంధ్రప్రదేశ్‌

విజయవాడకు రైళ్ల రాకపోకలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో విజయవాడ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న రూట్ రిలే ఇంటర్ లాకింగ్ పనులు రాత్రి, పగలు శరవేగంతో ముందుకు సాగుతున్నాయి. గురువారం వరకు పాక్షికంగా మూడు ప్లాట్‌ఫారాల్లో రైళ్ల రాకపోకలు సాగగా శుక్రవారం అన్ని ప్లాట్‌ఫారాల్లోను రైళ్ల రాకపోకలను నిలిపివేసి శరవేగంగా పనులు నిర్వహించారు. ఒకటి నుంచి 5వ నెంబర్ ప్లాట్‌ఫారం వరకు క్రాస్ ఓవర్ పాయింట్లను తొలగించి కొత్తవాటిని ఏర్పాటుచేసారు. దీనికి సంబంధించిన సిగ్నల్ పాయింట్లను అధికారులు తనిఖీ చేసారు. దాదాపు 2వేల మంది కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా శుక్రవారం రాత్రి సమయానికి ఆర్‌ఆర్‌ఐ తొలిదశ పనులు పూర్తయినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే 28వ తేదీ వరకు కూడా రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి. రైల్వే సమాచారం కోసం వచ్చేవారు మినహా ప్రయాణీకులు ఎవ్వరూ లేక నేడు విజయవాడ రైల్వే స్టేషన్ వెలవెలబోతూ కన్పించింది. రిజర్వేషన్ విచారణ కోసం మాత్రం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే 0866-2574872, 2574870, 2767040, 2767070 అలాగే తెనాలి నుంచి 08644- 227965 నెంబర్ నుంచి రద్దయిన, పాక్షికంగా రద్దయిన, దారి మళ్లించబడిన రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చు.

చిత్రం.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో పనులు జరుగుతుండటంతో నిర్మానుష్యంగా మారిన దృశ్యం