ఆంధ్రప్రదేశ్‌

కడప నగరంలో కోవిడ్-19 ఆసుపత్రిగా ఫాతిమా మెడికల్ కళాశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 13: కడప జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం రాత్రి వరకు 31 కేసులు నమోదయ్యాయి. సోమవారం ఎలాంటి కొత్తకేసులు నమోదుకాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. నమోదైన కేసుల్లో ఢిల్లీ మర్కస్‌కు వెళ్లి వచ్చిన వారు 17 మంది ఉన్నారు. ప్రస్తుతానికి జిల్లాలో ప్రొద్దుటూరు, కడప , పులివెందుల, బద్వేలు, మైదుకూరు, వేంపల్లె పట్టణాల్లో కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. వీటిని జిల్లా ఉన్నతాధికారులు రెడ్‌జోన్‌లుగా ప్రకటించారు. ప్రొద్దుటూరులో 2, కడపలో 6, పులివెందులలో 4, బద్వేలులో 4, మైదుకూరులో 3, వేంపల్లెలో 2 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివ్ వ్యక్తులందరినీ కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజిలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచారు. జిల్లాలో పరీక్షల నిమిత్తం తీసుకొచ్చిన వారిని క్వారైన్‌టైన్‌లో ఉంచేందుకు కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలులలో క్వారైన్‌టైన్ సెంటర్లు ఏర్పాటుచేశారు. కడపలో యోగివేమన యూనివర్సిటీ, హజ్‌హౌస్ కేంద్రాలను క్వారైన్‌టైన్ కేంద్రాలుగా ఏర్పాటుచేశారు. ప్రొద్దుటూరులో వెంకటేశ్వర ప్రభుత్వ పశువైద్యశాలలో 200 పడకల క్వారైన్‌టైన్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. పులివెందులలో 52 పడకల క్వారైన్‌టైన్ సెంటర్‌ను ఎన్‌ఏసీ (నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్)లో ఏర్పాటుచేశారు. బద్వేలులో ఎస్‌బీవీఆర్ కళాశాలలో 88 పడకలతో క్వారైన్‌టైన్‌ను ఏర్పాటుచేశారు. జిల్లాలో కరోనా పరీక్షల ప్రయోగశాలను ఫాతిమా వైద్యకళాశాలలో ఏర్పాటుచేశారు. లాక్‌డౌన్ విధించిన తొలినాళ్లలో జిల్లాలోని త్రోట్ (గొంతు) శ్యాంపిల్స్‌ను తిరుపతిలోని స్విమ్స్‌కు పంపేవారు. ఢిల్లీ మర్కస్ సంఘటన తరువాత ఫాతిమా వైద్యకళాశాలను కోవిడ్ -19 ఆసుపత్రిగా మార్చారు. ఇక్కడే పరీక్షల కోసం ల్యాబ్ ఏర్పాటుచేశారు. జిల్లాలో ఏర్పాటుచేసిన ప్రొద్దుటూరు, బద్వేలు, పులివెందుల క్వారైన్‌టైన్ సెంటర్‌లో ఉన్న వారి నుండి గొంతు శ్యాంపిల్స్ తీసుకుని కడపలోని ఫాతిమా వైద్యకళాశాలకు పంపుతున్నారు. విదేశాల నుండి వచ్చిన వారి త్రోట్ శ్యాంపిల్స్‌ను, వారి కుటుంబ సభ్యుల త్రోట్ శ్యాంపిల్స్ కూడా ఇక్కడే పరీక్షిస్తున్నారు. ఈ ల్యాబరేటరీలో రోజుకు 80 పరీక్షలను మాత్రమే నిర్వహించగలుగుతున్నారు. దీంతో పరీక్షల ఫలితాలు వచ్చేందుకు 2 నుండి 4 రోజులు పడుతోంది.
విదేశాల నుండి వచ్చిన వారు హోమ్ క్వారైన్‌టైన్‌లో
జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారు 4,941 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండవచ్చునని అనధికారిక సమాచారం. గుర్తించిన వారందరినీ హోమ్ క్వారైన్‌టైన్‌లో ఉంచారు. మర్కస్ సంఘటన తర్వాత ఢిల్లీకి వెళ్లివచ్చిన 59 మందిని హోమ్ క్వారైన్‌టైన్‌లలో ఉంచి పరీక్షలకు శ్యాంపిల్స్ పంపారు. వీరి కుటుంబ సభ్యులను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్వారైన్‌టైన్ సెంటర్లలో ఉంచి త్రోట్ శ్యాంపిల్స్ తీసుకున్నారు. కాగా హోమ్ క్వారైన్‌టైన్‌లలో ఉన్న వారిపై సరైన నిఘా కొరవడిందనే ప్రచారం ఉంది. చేతిపై హోమ్ క్వారైన్‌టైన్ అనే ముద్రవేసి ఇళ్లలో ఉంచడం మినహా వారిపై సరైన నిఘా లేదనే ప్రచారం ఉంది. ఇలాంటి వారు బయట తిరుగుతున్నారని జనాంతికంగా వినిపిస్తోంది. కడప నగరంలో హోమ్ క్వారైన్‌టైన్‌లో ఉంచిన వారిని రోజుకు మూడుసార్లు చెక్ చేస్తున్నట్లు నగర కార్పొరేషన్ కమిషనర్ లవన్న తెలిపారు. ఇది అందరి సమస్య కాబట్టి ఎవరికి వారు బాధ్యతగా ఉండాలని సూచించారు.