రాష్ట్రీయం

జై జవాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, సెప్టెంబర్ 24: వర్షబీభత్సంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బండారి లే అవుట్ కాలనీలో పరిస్థితులను చక్కదిద్ది ప్రజలను రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగాయి. కాలనీ వాసులకు నిద్రలేకుండా చేస్తున్న తుర్కచెరువు కట్ట డేంజర్‌జోన్‌గా ప్రకటించి బోర్డును ఏర్పాటు చేసి ఎవరినీ అటు వెళ్లనివ్వకుండా చర్యలు చేపట్టారు. బాధితులకు పాలు, బ్రెడ్, బిస్కెట్, తాగునీరు వంటి వాటిని అందించారు. చెరువువద్దకు ఎవరూ రావద్దని హెచ్చరికలను జారీ చేశారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ టీమ్‌లు తమ వాహనంలో పడవలు, రక్షణ కవచాలతో పూర్తి బందోబస్తుతో సిద్ధమయ్యారు. ఎలాంటి ప్రమాదం ఎదురైనా తక్షణమే రక్షణ చర్యలకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు బండారి లే అవుట్ కాలనీ వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు సహాయ, సహకారాలను అందిస్తున్నారు. శ్రీ మాతాయోగి అన్నపూర్ణేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ సంస్థ సభ్యులు తమ వాహనంలో అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరికొంతమంది యువకులు పాలు, బన్నులు, బ్రెడ్‌లు, బిస్కెట్‌లను అపార్ట్‌మెంట్ వాసులకు అందజేశారు. యువతులు విస్తరాకులలో అన్నం పెట్టుకుని అపార్ట్‌మెంట్ గోడల పై నుండి బాధితులకు అందించారు. అంతేకాకుండా ఆర్‌ఎస్‌ఎస్ బృందాలు అపార్ట్‌మెంట్ సెల్లార్‌ల లోపలికి వరద నీరు వెళ్లనివ్వకుండా ఇసుక బ్యాగులను అడ్డుగా పెట్టారు. కాగా బండారి లే అవుట్ కాలనీలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పర్యటించారు. తుర్కచెరువును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని వరద ముంపు సమస్యను పరిష్కరించాలని అన్నా రు. ఎమ్మెల్సీ రాజు బండారి లే అవు ట్ కాలనీలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అన్ని సహాయక చర్యలను చేపడుతున్నామని రాజు తెలిపారు.

చిత్రం.. ఆల్వాల్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల సహాయక చర్యలు