కృష్ణ

భారత్ మాతాకీ జై అంటే దేశానికి నమస్కారం పెట్టినట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: భారతదేశంలో జన్మించి ఇక్కడ బతుకుతున్న వారంతా భారత్ మాతాకి జై అనాల్సిందే... అసలు ఇందులో తప్పు ఏమిటి. ఈ దేశంలో సర్వమతాలు, కులాల వారున్నారు. వారందరికీ జై అనే్నట్లే కాగలదని కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. విభిన్న జాతులు, సంస్కృతులు, వ్యక్తుల సమూహాన్ని కలిదించే శక్తి ఏ వ్యక్తి.. ఏ దేశానికి లేదన్నారు. బిజెపి ఆధ్వర్యంలో శనివారం నాడిక్కడ ఓ ఫంక్షన్ హాలులో జరిగిన జాతీయ సమైక్యత సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రారంభంలో వేదికపై ఏర్పాటైన భారతమాత, రాజగురు, సుఖదేవ్, భగత్‌సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభకు నగర అధ్యక్షులు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు అధ్యక్షత వహించారు. ముందుగా భారతీయ జనతా పార్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడుతూ ఈ భరతమాత గడ్డపై ఉన్న వారంతా వందేమాతరం పాడాల్సిందే అన్నారు. భారతదేశంలో జన్మించినందుకు ముస్లింలందరు గర్వపడాలన్నారు. మాజీ మంత్రి, రాష్ట్ర నాయకులు కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఈ దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణాలర్పిస్తే నేడు కొన్ని శక్తులు కులం, మతం పేరుతో ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 60 ఏళ్లపాటు ముస్లింలు, దళితులకు ఒరిగిందేమీలేదని అయితే మోదీ రెండేళ్ల పాలనలోనే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటం ప్రారంభమైందన్నారు. కొన్ని శక్తులు పాకిస్తాన్, చైనా సిద్ధాంతాలు ప్రచారం చేస్తూ విశ్వవిద్యాలయాలను ఒక వేదికగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. విద్యార్థుల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అధికారం లేదనే తీవ్ర అసహనంతో రాహుల్ గాంధీ దేశద్రోహులకు అండగా నిలుస్తున్నారంటూ కన్నా ధ్వజమెత్తారు. ఈ వైఖరిని ప్రతి భారతీయుడు ఖండించాలన్నారు. దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షులు దారా సాంబయ్య మాట్లాడుతూ ఉత్సాహం, ధైర్యం, బుద్ది, సాహసం, శక్తి, పరాక్రమలు ఈ ఆరు లక్షణాలు కల్గిన వారిలో భగవంతుడు ఉంటాడంటూ వెంకయ్య నాయుడులో ఈ ఆరు లక్షణాలున్నాయని అన్నారు. భారత మాతాకి జై అంటే కొట్టే వారిని ఆ భగవంతుడు క్షమించబోడని అన్నారు. సభలో నగర ఇన్‌చార్జి ఆర్ లక్ష్మిపతి, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, దోగిపర్తి శ్రీనివాస్, నగర ప్రధాన కార్యదర్శులు అర్ముగం, తోట శివనాగేశ్వరరావు, బొబ్బూరి శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు రామినేని వెంకట కృష్ణ వందన సమర్పణ చేశారు.

మంచినీటి కష్టాలు తీరేదెన్నడు?
బంటుమిల్లి, మార్చి 26: బంటుమిల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఎంపిపి పాలడుగుల వనవలమ్మ అధ్యక్షతన జరిగింది. అర్తమూరు గ్రామంలో మంచినీటి సమస్యపై గ్రామ ఎంపిటిసి, వైకాపా నాయకులు బొర్రా రమేష్‌కు, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయిలో జరిగాయి. అర్తమూరు గ్రామంలో వేసవి ఎద్దడి ఉన్నా మంచినీటి చెరువులకు నీరు పెట్టలేదని, కనీసం చెరువులో నీరు పెట్టుకోమని సమాచారం ఇవ్వలేదని రమేష్ అధికారులను నిలదీశారు. దీనిపై ఎమ్మెల్యే కాగిత స్పందిస్తూ గ్రామంలో నెలకొన్న రాజకీయాల వల్ల నాయకుల్లో సఖ్యత కొరవడిందని, దీనివల్ల సమస్యలు పరిష్కారం కావటం లేదన్నారు. చెరువుకు నీరు పెట్టుకోకపోవటం దీనికి నిదర్శనమన్నారు. అయితే తాను సర్పంచ్‌గా ఉన్న సమయంలో వేసిన బోరుతోనే నేటికీ నీరు అందిస్తున్నారని ఎంపిటిసి రమేష్ వాదించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా గ్రామంలో నీటి సమస్యపై అధికార పార్టీ దృష్టి పెట్టలేదని ధ్వజమెత్తారు. దీనిపై ఎమ్మెల్యే కాగిత స్పందిస్తూ గతంలో తన హయాంలో మంచినీటి చెరువుకు నీరు పెట్టేందుకు కెనాల్ నుండి పైపులైన్‌కు నిధులు మంజూరు చేస్తే ఉపయోగించుకోలేక పోయారన్నారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా మంచినీరు అందించేందుకు కృషి చేస్తామని, మల్లేశ్వరం మెగా రక్షిత మంచినీటి పథకం, అర్తమూరు పథకాన్ని జోడించి మంచినీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కంచడం, కొత్తూరు గ్రామస్తులు దేవాలయ భూముల్లో ఉండటం వల్ల గృహ నిర్మాణాలు జరుపుకోలేక పోతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కంచడం గ్రామ సర్పంచ్ గంధం సత్యనారాయణ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో పెందూరు, బర్రిపాడు, కంచడం గ్రామాల సర్పంచ్‌లు మాత్రమే హాజరయ్యారు. జెడ్పీటిసి దాసరి కరుణజ్యోతి, ఎంపిడివో సిహెచ్ కళావతి, వైస్ ఎంపిపి వీరంకి వెంకట రాజారావు, కో-ఆప్షన్ సభ్యులు నూర్‌బాషా, అధికారులు పాల్గొన్నారు.

సారా రక్కసిని తరిమేస్తాం!
కృత్తివెన్ను, మార్చి 26: మండల పరిధిలోని చినగొల్లపాలెంను సారా రహిత గ్రామంగా మార్చడానికి తాము సిద్ధమేనని గ్రామస్తులు తెలిపారు. ఏప్రిల్ 1 నుండి చినగొల్లపాలెంను సారా రహిత గ్రామంగా ప్రకటించవచ్చని అధికారులకు తెలిపారు. జిల్లా సరిహద్దు గ్రామమైన చినగొల్లపాలెంలో శనివారం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ఎక్సైజ్ అధికారులు నవోదయ కార్యక్రమాన్ని నిర్వహించారు. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ సునీత, భీమవరం ఎక్సైజ్ సూపరింటెంటెంట్ శ్రీనివాసులు సారా తయారీదారులు, గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సారా తయారీని స్వచ్ఛందంగా నిలుపుదల చేయాలని గ్రామస్తులకు సూచించారు. దీనిపై కొక్కిలిగడ్డ బాపూజీ, గ్రామపెద్దలు సారా మహమ్మారిని రూపుమాపడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి గ్రామంలో ఉన్న పెద్దలతో చర్చించి తీర్మానం చేస్తామని తెలిపారు. గ్రామంలో సారా తయారుచేసే వారిపై చర్యలు తీసుకుంటామని గ్రామస్తులు అధికారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిఐ అమరేశ్వరరావు, తహశీల్దార్ మధుసూదనరావు, ఎంపిడివో ఐవి సత్యవతి, కనకబాబు, ఎక్సైజ్ శాఖ పోలీసు అధికారులు పాల్గొన్నారు.