ఆంధ్రప్రదేశ్‌

ప్రజాసమస్యలకు తక్షణ పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటున్న ప్రభుత్వం ప్రజాసమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించే చర్యలను చేపట్టింది. గత 17 నెలల్లో 60.65 లక్షల ఆర్జీలు రాగా, అందులో 58.64 లక్షల వినతులను పరిష్కరించింది. ఇందుకోసం నిరంతరం తమ సమస్యల పరిష్కారం ఏ దశలో ఉందో ఏ రీతిన పరిష్కారమయ్యిందో తెలుసుకునేందుకు ‘మీ కోసం’ పోర్టల్‌ను నిర్వహిస్తోంది. వ్యక్తిగత సమస్యలైనా, సామూహిక సమస్యలైనా వీలైనంత వరకూ ఆర్జీల పరిష్కారానికి ‘మీ కోసం’ డాష్‌బోర్డును నిర్వహిస్తోంది. ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రుణం మంజూరు, పింఛన్లు, స్వయం ఉపాధి రుణాలు, గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, స్కూళ్లు కాలేజీల ఏర్పాటు వంటి అనేక సమస్యలపై ఈ ఆర్జీలు ప్రభుత్వానికి అందుతున్నాయి. ఇంతవరకూ 90 శాతానికి పైగానే సమస్యలకు పరిష్కారం చూపడమైందని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు చెప్పారు.
రాష్టవ్య్రాప్తంగా 13 కలెక్టరేట్లలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం నాడు సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చిన ప్రతి వినతికి సంబంధించి అధికారులు రసీదులు ఇస్తున్నారు. అదే సమయంలో సంబంధిత మొబైల్‌కు మెసేజ్ పోతుంది. ఆగస్టు నెలలో 21,960 ఆర్జీలు రాష్ట్రంలో అందగా, వాటిలో 8 వేలకు పైగా సమస్యలను పరిష్కరించారు. ‘మీకోసం’ ఆన్‌లైన్‌లో వచ్చిన ఫిర్యాదులను సైతం ఎప్పటికపుడు అధికారులు పరిష్కరిస్తున్నారు. అదే సమయంలో 1100/1800-425-4440 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి తమ వినతులపై పరిష్కారాలను ఆర్జీదారులు తెలుసుకునే సౌలభ్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.