ఆంధ్రప్రదేశ్‌

దేశవాళీ క్రీడాకారులకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 24: దేశవాళీ క్రికెట్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన యువకులను ప్రోత్సహించేందుకు శాయశక్తుల కృషిచేస్తానని బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన ఎంఎస్‌కె ప్రసాద్ వెల్లడించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, తెలుగువాడికి తొలిసారిగా బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా రావడం తెలుగువారికి గర్వించదగ్గ విషయమని, శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బిసిసిఐ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపడతానన్నారు. ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతానని, తాను దేశవాళీ క్రికెట్‌లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు, యువకులను ప్రోత్సహిస్తానని, ఇందు లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబరిచిన యువకులను జాతీయ క్రీడలకు ఆడిస్తే తనకు తృప్తిగా ఉంటుందని తన అభిప్రాయాన్ని తెలిపారు. గత సెలక్షన్ కమిటీ కృషి చేసిన విధంగానే తాను కృషి చేస్తానని చిన్నపట్టణాల నుండి ధోని, ఉమేష్ యాదవ్‌లాంటి ప్రతిభగల క్రీడాకారులు దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని గుర్తు చేశారు.
అనంతరం ఆయన రోడ్డు మార్గాన శ్రీవారిని దర్శించుకోడానికి బయలుదేరారు. అంతకుముందు విమానాశ్రయంలో బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌కు చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘం అసోసియేషన్ సభ్యులు చినబాబు, మురుగా, అనిల్‌కుమార్, సునీల్‌కుమార్ తదితరులు ఘనస్వాగతం పలికారు.