ఆంధ్రప్రదేశ్‌

రామాయపట్నం పోర్టు సాధనకు పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, సెప్టెంబర్ 24: ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాజధాని అమరావతికి, అటు బెంగళూరు నగరాన్ని అనుసంధానం చేయగల బహుళ ప్రయోజనాలను కలిగించే రామాయపట్నం పోర్టు సాధన కోసం తాము గట్టిగా కృషిచేస్తున్నామని ప్రజలంతా అది సహకారం అయ్యేంత వరకు ఉద్యమ బాటన పయనించాలని ఎంపిలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామిరెడ్డి సహకారంతో కావలి పట్టణంనుంచి రామాయపట్నంకు పాదయాత్ర చేపట్టగా కళుగోళశాంభవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో ఎంపి మేకపాటి మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తే రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. సాంకేతిక పరంగా అన్నిఅంశాలు సానుకూలంగా ఉన్నాయన్నారు. దేశంలో ఏర్పాటు చేయబోయే మూడు అతి పెద్ద పోర్టుల్లో రామాయపట్నం పోర్టుకూడా ఒకటి కాగలదని చెప్పారు. గతంలో నెల్లూరు జిల్లా దుగరాజపట్నం వద్ద పోర్టు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినా అక్కడ కొన్ని సాంకేతిక అంశాలపై అభ్యంతరాలు వస్తుండడంతో పోర్టు నిర్మాణం ఆగిందన్నారు. దుగరాజపట్నంతో పాటు కచ్చితంగా రామాయపట్నం పోర్టును మంజూరుచేయాలని అటు గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి నాయకులు ఈ విషయమై స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు.
రెండు పోర్టులు ఇస్తే మరీ మంచిది : ఎంపి వైవి
ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తాము దుగ్గరాజపట్నం పోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఎగుమతులు, దిగుమతుల పరంగా అనేక అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. నేరుగా కేంద్ర ప్రభుత్వం కాని లేదా ప్రైవేటు సంస్థల సహకారంతో దీనిని నిర్మించాలని సూచించారు. పార్లమెంట్‌లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని పోర్టు సాధనకు కృషి చేస్తామన్నారు. అందకుముందు రామాయపట్నం పోర్టు సాధన కోసం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సహకారంతో వంటేరు వేణుగోపాల్‌రెడ్డి నేతృత్వంలో కావలి పట్టణం నుంచి ప్రకాశం జిల్లా రామాయపట్నం వరకు భారీ ఎత్తున పాదయాత్ర జరిగింది. పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు హారతి పట్టి నీరాజనం పలికారు.

చిత్రం.. కావలి పట్టణం నుంచి పాదయాత్ర చేస్తున్న ఎంపీలు మేకపాటి, వైవి సుబ్బారెడ్డి