ఆంధ్రప్రదేశ్‌

హోదా ఇవ్వకుండా దగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామంటూ టిడిపి, బిజెపిలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఏపి కాంగ్రెస్ నేతలు శనివారం నాడు ఢిల్లీలో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. తరువాత రఘువీరా విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను బిజెపి వంచించిన తీరును మన్మోహన్‌తో చర్చించినట్టు తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు పార్లమెంట్‌లో హామీ ఇచ్చారని, అలాగే కేబినెట్‌లో తీర్మానం చేసినా ఎన్‌డిఏ దాన్ని పక్కనబెట్టి ప్యాకేజీ ప్రకటించడంపై మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారని ఆయన తెలపారు. ఏపి ప్రజల తరపున వారి హక్కుల కోసం పోరాటం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారని రఘువీరా వెల్లడించారు. పదేళ్లు హోదా ఇస్తామన్న బిజెపి, ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన విషయన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు టిడిపి,బిజెపి ఇచ్చిన హామీల అమలుపై, ప్రత్యేక హోదాపై ఈ నెల 28న తిరుపతి నుంచి ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నట్టు పిసిసి అధ్యక్షుడు ప్రకటించారు. తెలుగుదేశం, బిజెపి మోసాలను ప్రజలకు వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావుమాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో పెద్ద మొత్తంలో కమీషన్లు కోసమేనని ఆరోపించారు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీని ఆహ్వానిస్తున్నామని చెప్పడాన్ని ఆయన విమర్శించారు. ఏ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి అప్పగించిందని ఆయన నిలదీశారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ప్రతి పాదించిన స్విస్ చాంలెంజ్ వెనక ముఖ్యమంత్రికి అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నారు. శాసన సభ సీట్లు పెంపుకోసం కేంద్రంతో బాబు ఒప్పదం కుదుర్చుకోనున్నారని విమర్శించారు.