ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి ప్రపంచ బ్యాంకు రూ.3,324 కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టుకున్న ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లోగా తొలిదశ నిర్మాణాలు కొన్నయినా పూర్తి చేయాలన్న లక్ష్యంతో అటు కేంద్రం, ఇటు విదేశీ బ్యాంకులపై ఒత్తిడి చేస్తున్న తెదేపా ప్రభుత్వ ప్రయత్నాలు కొంతమేరకు ఫలించాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.3,324 కోట్లు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది. ఆర్థికంగా, రాజకీయంగా క్లిష్ట పరిస్థితిలో ఉన్న బాబు సర్కారుకు ఇది ఒకరకంగా శుభవార్తే.
కొత్తగా నిర్మించనున్న రోడ్లు, నేలపాడులో వసతుల కల్పన, వరద నియంత్రణ కోసం ప్రపంచబ్యాంకు ఈ నిధులు ఇవ్వనుంది. 65 కిలోమీటర్ల మేర సబ్-ఆర్టీరియల్ రోడ్లతో కలిపి మొత్తం 4,749 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. ఇందులో ఏపి ప్రభుత్వం 1,425 కోట్లు సమకూర్చి, వాటిని సీఆర్‌డీఏకు ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టును 2019 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఆ మేరకు ప్రపంచబ్యాంకు నుంచి ఆమోదముద్ర లభించింది. ఈ నిధులు వచ్చే మార్చి నుంచి విడుదల కానున్నాయి. నవ్యాంధ్ర అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న 13 భారీ ప్రాజెక్టులకు అంచనాలు రూపొందించి, వాటిని కేంద్రానికి పంపింది. కేంద్రం అనుమతి లభిస్తే విదేశీ రుణాలకు లైన్‌క్లియర్ అవుతుంది. అమరావతి రాజధానికి 4,749 కోట్లు, రాష్ట్ర రహదారుల విస్తరణకు 1679 కోట్లు, కమ్యూనిటీ వాటర్ మేనేజ్‌మెంట్‌కు 1,600 కోట్లు, విలేజీ కనెక్టివిటీకి 3,200 కోట్లు, రాష్ట్ర రహదారుల నిర్మాణానికి 3,300 కోట్లు, కరవు నివారణకు 1,831 కోట్లు, ఇరిగేషన్ జీవనోపాధి వృద్ధికి 2వేల కోట్లు, పట్టణ మంచినీటి సరఫరాకు 3723 కోట్లు, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు 2,689.50 కోట్లు, రూరల్ వాటర్ సప్లైకు 4,500 కోట్లు, 24 గంటల విద్యుత్ సరఫరాకు 500 కోట్లు, వైద్య, ఆరోగ్య వ్యవస్థ ప్రాజెక్టులకు 4,807 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. వీటికి విదేశీ రుణం అందితే అందులో 30 శాతం తన వాటాగా నిర్ణయించింది.
కాగా, రాష్ట్భ్రావృద్ధికోసం ఈ 13 భారీ ప్రాజెక్టులను రూపొందించిన బాబు ప్రభుత్వం వాటి నిధులకోసం విదేశీ బ్యాంకు, ఆర్థిక సంస్థల రుణాలు ఆశిస్తోంది. వీటికోసం చంద్రబాబు నాయుడు చాలారోజుల నుంచి ఆర్థిక శాఖ అధికారులతో నిరంతర సమీక్షలు నిర్వహించారు. అంచనా నివేదికలు తయారు చేయించడం నుంచి వాటిని కేంద్రానికి పంపి, అక్కడ కేంద్రమంత్రి సుజనాచౌదరితోపాటు, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులను పంపించేవరకూ వ్యక్తిగత పర్యవేక్షణ జరిపారు.
ఇప్పటికే ప్రపంచబ్యాంకు, జైకా ఇతర సంస్థలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం వాటి నుంచి 37,778.80 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేపట్టాలని భావిస్తోంది. ఈ మొత్తంలో విదేశీ సంస్థల నుంచి 26,253.71 కోట్లు రుణంగా తీసుకోవాలని నివేదిక రూపొందించింది. ఇందులో ఏపి ప్రభుత్వ వాటా రూ.11,525.09 కోట్లుగా తమ నివేదికలో అంచనా వేశారు.