ఆంధ్రప్రదేశ్‌

కొనసాగుతున్న అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 26: విధర్భ నుంచి చత్తీస్‌గడ్ పరిసరాలను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం సోమవారం కూడా కొనసాగుతోంది. దీనికి తోడు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి. ఇదే సమయంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో యలమంచిలిలో 11.4 సెంటీమీటర్లు, భీమడోలు 6.5, అచ్చంపేటలో 6, నూజివీడులో 5.2, చోడవరంలో 4, ఏలూరులో 3.6, నందిగాంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.