తెలంగాణ

ముందుకు వెళ్లొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణలో జిల్లాల పునర్విభజన హైకోర్టు ఇచ్చే తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉండాలని, ఈ అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, జిల్లాల పునర్విభజనపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 362ను సవాలు చేస్తూ సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అవునూరి రమాకాంతరావు, కరీంనగర్ జిల్లాలో ఇల్లంతకుంట మండలంలోని నాలుగు గ్రామాల సర్పంచ్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి మంగళవారం విచారించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్ సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ 1984 తెలంగాణ జిల్లాల ఏర్పాటు రూల్స్‌లో రూల్ 4(1) చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుపై జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను గ్రామ పంచాయితీ కార్యాలయాలు, గ్రామ చావిడిలో ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. గ్రామ పంచాయితీలు, గ్రామ చావిడీల్లో ప్రాథమిక నోటిఫికేషన్ వివరాలను ప్రదర్శించలేదని, పంచాయితీలు చేసిన తీర్మానాలను కోర్టు దృష్టికి తెచ్చారు. నోటిఫికేషన్‌ను జారీ చేయడమే అక్రమమన్నారు. నోటిఫికేషన్‌ను 1974 తెలంగాణ జిల్లాల ఏర్పాటు సెక్షన్ 3(5) కింద కాకుండా, 1984 తెలంగాణ జిల్లాల ఏర్పాటు రూల్స్ 4(1) కింద జారీ చేయడం తగదన్నారు. చట్టబద్ధమైన నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. జీవోలో జారీ చేసిన నిబంధనల ప్రకారం జిల్లాల ఏర్పాటుపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని పిటీషనర్ల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిబంధలకు విరుద్ధంగా గోప్యంగా జిల్లాల పునర్విభజన వ్యవహారాన్ని ప్రభుత్వం నడుపుతోందని కోర్టుకు వివరించారు. జిల్లాల పునర్విభజనపై ఇచ్చిన అన్ని రకాల నోటిఫికేషన్లపై స్టే మంజూరు చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. కాగా హైకోర్టు మాత్రం జిల్లాల పునర్విభజనకు అనుసరిస్తున్న ప్రొసీడింగ్స్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, దసరా సెలవుల అనంతరం కేసు విచారిస్తామని వాయిదా వేసింది.