ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా, గోదావరి నదీ జలాలు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఈ ఏడాది వర్ష రుతువు ప్రారంభమైనతర్వాత గత నాలుగు నెలల్లో కృష్ణా, గోదావరి నదుల ద్వారా 2175 టిఎంసి నీరు సముద్రంలో కలిశాయి. నాగార్జునసాగర్‌లో 167 టిఎంసి, తుంగభద్రలో 60 టిఎంసి, శ్రీశైలంలో మరో 40 టిఎంసి నీరు వస్తే ఈ ప్రాజెక్టులు పూర్తిగా నిండుతాయి. ఈ ప్రాజెక్టులు నిండాయంటే ఈ ఏడాది ఖరీఫ్, రబీకి లోటు ఉండదు. జూన్ 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు సగటున రోజుకు 3 లక్షల క్యూసెక్కుల నీరు బంగాళాఖాతంలో కలిశాయి. ఆల్మట్టి, నారాయణ్‌పూర్ నుంచి ఒక లక్ష కంటే తక్కువ క్యూసెక్కులను వదిలారు. కాని జూరాలపైన బీమా నది నుంచి వరద నీరు రావడంతో 25వ తేదీన 1.70 లక్షల క్యూసెక్కుల నీరు జూరాల మీదుగా శ్రీశైలంకు చేరింది.నాగార్జునసాగ్‌లో ప్రస్తుతం 150 టిఎంసి నీరు ఉంది. ఈ ప్రాజెక్టు కెపాసిటీ 312 టిఎంసి. సగం కూడా నిండలేదు. తుంగభద్రలో ప్రస్తుతం 40 టిఎంసి నీరు ఉంది. మరో 60 టిఎంసి నీరు చేరాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు రోజుకు 1.5 టిఎంసి నీరు చేరుతోంది.