ఆంధ్రప్రదేశ్‌

సమన్వయంతోనే ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 28: అభివృద్ధి సాధించడంతో పాటు ఆ ఫలాలు ప్రజలకు అందేలా చేయడలోనే పాలనా యంత్రాంగం పటుత్వం ఆధారపడి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అభివృద్ధి ప్రజల వాస్తవ జీవితాల్లో కనిపించే విధంగా ప్రభుత్వంలో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని బుధవారం ప్రారంభించిన చంద్రబాబు పరిపాలన సంస్కరణలను ఏ విధంగా తీసుకురావాలో దిశా నిర్దేశం చేశారు. తాను నవ్వుతూ, నవ్విస్తూ ఈ సమావేశాన్ని ఎంతో ఉత్సాహభరితంగా నడిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వసతి గృహాల్లో బయో మెట్రిక్ విధానాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకురాబోతున్నామని చెప్పిన ఆయన ‘దీని వల్ల ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదంటూ’ చిరునవ్వులు చిందించారు. గంట ముందుగా వెళ్లినా ఆ రోజు ఫైళ్లన్నంటినీ పూర్తి చేసి వెళ్లాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వంటి విపత్తులు సంభవించినపుడు 24 గంటలు పనిచేయించినా ఇతర రోజుల్లో సంతోషంగా పనిచేసుకుని వెళ్లిపోవచ్చన్నారు. రోజూ ఆ నాలుగు గోడల మధ్య గడిపినా ఆలోచనలు వేరుగా ఉంటాయంటూ శారీరక, మానసిక ఆనందం కోసం కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలన్నారు. మున్ముం దు అధికారులు, ఉద్యోగులెవరూ శారీరక శ్రమ పడాల్సిన అవసరం ఉండదన్నారు. సిసి కెమెరాలు, డ్రోన్‌ల సహాయంతో తమ సీటు నుంచే వీధుల్లో చెత్తచెదారం నుంచి అతి పెద్దప్రాజెక్టుల్లో జరిగే పనులను కూడా పర్యవేక్షిస్తూ సూచనలు, ఆదేశాలు జారీ చేయవచ్చునన్నారు. అయితే ఇందుకు కాస్త టెక్నాలజీపై అవగాహన పెంచుకుంటే చాలన్నారు. ప్రైవేట్ వారికి డ్రోన్‌లకు అనుమతిచ్చేది లేదంటూ వారికిస్తే బాంబులను చేరవేస్తారని అన్నారు. వివిధ పథకాల కింద రుణాల మంజూరులో జరుగుతున్న జాప్యంపై నిలదీసేందుకై ఇక నుంచి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాలకు కలెక్టర్లను, కలెక్టర్ల సమావేశానికి లీడ్ బ్యాంక్ అధికారులను ఆహ్వానించనున్నామన్నారు. వాణిజ్య స్థాయిలో ప్రయోజనం చేకూర్చగల పరికరాలను రూపొందించేందుకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. ఇందుకోసం అంకుర సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో వినూత్న ఆలోచనలు, పద్ధతులు కనుగొనేందుకు ఇన్నోవేషన్ చాప్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 68 శాసనసభ నియోజకవర్గాల్లో తలసరి ఆదాయం ఒక లక్ష కంటే ఎక్కువగా ఉందని, మరో 77 నియోజకవర్గాలలో సంతృప్తికర సగటు తలసరి ఆదాయం నమోదయిందని చంద్రబాబు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 177 కిమీ మేర సముద్ర తీర ప్రాంతం, నాగావళి, వంశధార వంటి నదులు ఉన్నప్పటికీ రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో అట్టడుగునున్న 10 నియోజకవర్గాల్లో, ఐదు ఆ జిల్లాల్లోనే ఉండటం బాధాకరమన్నారు. ప్రాంతాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను తొలగించడానికి ఉపకరించే వ్యవసాయం, పశుపోషణ, కోళ్ల పెంపకం, మత్స్య పరిశ్రమ వంటి అనుబంధ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏటా 8వేల కోట్ల మేర నాబార్డు రుణం లభించబోతోందన్నారు. 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు. దీంతోపాటు 960మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు.
chitram...
కలెక్టర్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు