ఆంధ్రప్రదేశ్‌

అనంతఫురం నుండి అమరావతికి ఎక్స్‌ప్రెస్ హైవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చుట్టూ రహదారులు నిర్మించడంతోపాటు, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుండి రాజధానికి అతి తక్కువ సమయంలో చేరుకునేలా రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగా అనంతపురం నుండి అమరావతికి 371 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తారు. ఈ రహదారిలో 33 మేజర్ బ్రిడ్జిలను నిర్మిస్తారు. నాలుగు రైల్వే బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉంటుంది. 14 ఇంటర్ ఛేంజెస్ ఉంటాయి. రహదారి మధ్యలో 10 కిలోమీటర్లు మేర కొండలు, సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. మొత్తం ఈ రహదారి నిర్మాణానికి రూ.17,111 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రహదారి సమీపంలో భూ సేకరణ ప్రభుత్వానికి పెద్ద సవాలు కానుంది. భూములు కోల్పోయిన రైతులకు 1354 కిలోమీటర్లు మేర పరిహారం కూడా చెల్లిస్తారు. ఈ రహదారిలో అటవీ విస్తీర్ణం 29.3 కిలోమీటర్లు వస్తుంది. దీనికి పర్యావరణ శాఖ నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది. అలాగే అమరావతి చేరుకోవాలంటే కర్నూలు ఫీడర్ కనెక్టివిటీ కోసం 123.7 కిలోమీటర్లు రహదారి నిర్మిస్తారు. ఈ రహదారికి ఆరు ప్రధాన బ్రిడ్జిలుంటాయి. ఒక రైల్వే బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంటుంది. రహదారికి నాలుగు ఇంటర్ చేంజెస్ ఉంటాయి. దీనికి 6970 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రహదారికోసం 323 కోట్లు వెచ్చించి భూ సేకరణ జరపాల్సి ఉంటుంది. మరోపక్క 27.1 కిలోమీటర్లు మేర అటవీ భూమిలో రహదారి నిర్మించాల్సి ఉంటుంది. కడప మార్గంలో కనెక్టివిటీకి 104 కిలోమీటర్లు రహదారి నిర్మించాలి. ఇందుకోసం 3554 కోట్ల మేర ఖర్చవుతుంది.