ఆంధ్రప్రదేశ్‌

భలే బ్యాలెట్ తీర్పు బాసూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ప్రత్యేక హోదా పేరుతో జనాలకు చేరువయేందుకు విపక్షాలు వివిధ రూపాల్లో చేస్తున్న ఆందోళనకు ప్రజల నుంచి ఆశించిన స్పందన లభిస్తున్నట్లు కనిపించడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జనస్పందన లేక, కార్యకర్తలే దిక్కయ్యారు. మాజీమంత్రులు అప్పట్లో కూరగాయల మార్కెట్లకు వెళ్లినా సంతకం చేసేవారే కరవయ్యారు. దానితో ఓటరు లిస్టుతో కార్యకర్తలే సంతకాల సేకరణ ముగించారు. ఇప్పుడు మళ్లీ హోదాపై కాంగ్రెస్, సిపిఐ చేపడుతున్న బ్యాలెట్ బాక్సుల ఓటింగు కార్యక్రమానికి జనం నుంచి స్పందన లభిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో అన్ని పార్టీలు నెలరోజుల క్రితం వరకూ గళం విప్పాయి. కానీ సాంకేతికంగా హోదా ఇచ్చే పరిస్థితి లేనందున దానికి సరిసమానమైన ఆర్థిక ప్యాకేజీ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించి, ప్యాకేజీ వల్ల వచ్చే లాభాన్ని వివరించడం మొదలుపెట్టారు. అయితే, హోదాపై బాబు వైఫల్యాన్ని ప్రస్తావించి, ఆ అంశాన్ని సజీవంగా ఉంచే లక్ష్యంతో ప్రతిపక్ష నేత జగన్ ప్రతివ్యూహంతో వెళుతున్నారు. ఇవన్నీ ఒక వర్గం ప్రజలను బాగానే ఆకట్టుకుంటున్నాయి.
నిజానికి ప్యాకేజీ రాకముందు ఏపి ప్రజల్లో హోదా కాంక్ష బలంగా ఉన్నప్పటికీ, అది రాదని తేలిపోయి ప్యాకేజీ ప్రకటించడంతో అంతకుముందున్న అసంతృప్తి చాలావరకూ తగ్గింది. రాని హోదా గురించి పోరాడటంకంటే, ఇచ్చిన ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవచ్చన్న దిశగా వివిధ చానళ్లలో జరిగిన బహిరంగ చర్చలు కూడా వారిపై ప్రభావం చూపాయి. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఇలాంటి వాతావరణమే కనిపించింది.
కాగా, కాంగ్రెస్, సిపిఐలు హోదాపై ప్రజాభిప్రాయం పేరిట బ్యాలెట్ బాక్సులు ఏర్పాటుచేశాయి. విజయవాడలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ దానిని ప్రారంభించగా జనస్పందన లభించలేదు. లాభం లేదనుకుని సొంత పార్టీ కార్యకర్తలు, స్కూలు పిల్లలతో అభిప్రాయసేకరణ అయిందనిపించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా తిరుపతిలో బ్యాలెట్ ఓటింగు కార్యక్రమం నిర్వహించినా అది కూడా తూ తూ మంత్రంగానే ముగిసింది. దీన్నిబట్టి రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమయిన కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని ఏపి ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారని స్పష్టమవుతోంది.