రాష్ట్రీయం

పేదలకు సైతం అందమైన ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: ప్రభుత్వం నిర్మించే ఇళ్లు ప్రజలు నివాసయోగ్యంగానే కాకుండా, మరింత సౌకర్యవంతంగా ఉండాలని, పట్టణాల్లో నిర్మించే కాలనీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గృహనిర్మాణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. హౌసింగ్ రంగంలో మాత్రమే నిరంతర అభివృద్ధికి అవకాశం ఉంటుందని, అందువల్ల గృహనిర్మాణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. కోటి 30 లక్షల కుటుంబాలను ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ డాటాను సైతం జిపిఎస్, జిఎఎస్‌లతో అనుసంథానం చేయాలని యోచిస్తోంది, అపుడే నిజమైన అర్హులు ఎవరో తెలుస్తుందని, ఎన్ని ఇళ్లు నిర్మించాలో ప్రభుత్వానికి ఒక అవగాహన ఏర్పడుతుందని భావిస్తోంది. రాజీవ్ స్వగృహ లాంటి పథకాల్లో లబ్ధిదారులను సైతం గుర్తించి, ఇంకా ఆ ఇళ్లల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసి వాళ్లకు అందేలా చర్యలు తీసుకోవలసి ఉంది. పట్టణ ప్రాంతాల్లో నిర్మించే కాలనీలు అందరికీ మోడల్‌గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఎం ఇప్పటికే సూచించారు.
కాలనీల్లో అన్ని సౌకర్యాలు , సదుపాయాలు కల్పించాలని, షాపింగ్‌కు, ఎంటర్‌టైన్‌మెంట్‌కు అనువుగా తీర్చిదిద్దాల్సి ఉంటుందని, ఫుడ్ కోర్టులు, పచ్చిక మైదానాలు కల్పించాల్సి ఉందని, ఎల్‌ఐజి, ఎంఐజి, హెచ్‌ఐజి ఇళ్లు అన్నీ ఒకే చోట ఉంటే అప్పుడే ఆర్ధిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటాయని ప్రభుత్వం యోచిస్తోంది. ఆధునిక హౌసింగ్ టెక్నాలజీతో మోడల్ టౌన్‌షిప్‌లు నిర్మించాలని, ప్రతి జిల్లాలో ఎన్ని ఇళ్లు నిర్మించాలో అంచనా వేసి నివేదికలు సమర్పించాలని సిఎంఓ ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించింది. సంబంధిత జిల్లాల్లో ఎంత మేరకు భూమిని సేకరించాలో, అభివృద్ధి చేయాల్సిన భూమి ఎంత ఉందో, వౌలిక సదుపాయాల కల్పనకు ఎంత వ్యయం అవుతుందో నివేదికలు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ భూములు వివిధ రకాలుగా ఉండటంతో వాటి రికార్డుల నిర్వహణలో కూడా శ్రద్ధ వహించాలని రెవిన్యూ సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామకంఠాలు, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ భూములను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్‌కు అనువుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో లక్షా 60వేల కిలోమీటర్ల మేర మ్యాపింగ్ చేయాలని ఇప్పటికే రెవిన్యూ శాఖకు ఆదేశాలు వెళ్లాయి.