ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వర్సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సాంకేతిక విద్యకు ప్రముఖ స్థానం ఇస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి కేంద్రంగా ఎస్వీ యూనివర్సిటీలో డిసెంబర్‌లో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం గుజరాత్‌కి చెందిన ఫోరెన్సిక్ యూనివర్సిటీ, కోల్‌కతాకు చెందిన ప్రాక్సిస్ బిజినెస్ స్కూల్స్‌కు ఏపితో ఒప్పందం కుదిరింది. శుక్రవారం విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో ఆయా సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయు కుదుర్చుకుంది. అందుకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఐటి సెక్రటరీ పిఎస్ ప్రద్యుమ్న, ముఖ్య ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఐటిలో అడ్వైజర్ జేఏ చౌదరిలు గుజరాత్ ఫోరెన్సిక్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జెఎం వ్యాస్ డైరక్టర్ జనరల్‌లతో ఒప్పందం కుదుర్చుకోవటం జరిగింది. రెండో ఒప్పందాన్ని కోల్‌కతాకు చెందిన ప్రాక్సిస్ బిజినెస్ స్కూల్‌తో కుదుర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి ఐటిలో అడ్వైజర్ జేఎ చౌదరి మాట్లాడుతూ డాటా అనలిటిక్స్‌లో ప్రముఖ సంస్థ ప్రాక్సిన్ బిజినెస్ స్కూల్, గుజరాత్ ఫోరెన్సిక్ సంస్థలు తిరుపతి యూనివర్సిటీ స్థాపనలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నాయన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని డిజిటల్ టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ ముందంజ వేయాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించటం జరుగుతుందన్నారు. ప్రపంచంలో మొదటి యూనివర్సిటీగా డిజిటల్ వర్సిటీని తిరుపతిలో ఐదు కోర్సులతో స్థాపించటం జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోయాయని, అందులో మనం వెనుకబడిపోకూడదని దీన్ని స్థాపిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్‌లో ఏడేళ్ల క్రితం సైబర్ నేరాలను గుర్తించటానికి ఈ వర్సిటీని స్థాపించటం జరిగిందన్నారు. ఐదు అంశాల్లో కోర్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం రెండు కోర్సుల్లో 50 సీట్లతో ప్రారంభించనున్నారన్నారు. ఏపి స్కిల్ డెవలప్‌మెంట్ వారు దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఐటి సెక్రటరీ ప్రద్యుమ్న మాట్లాడుతూ 20ఏళ్ల క్రితం ఐటి ఇండస్ట్రీ వేరు, ఇప్పటి ఐటి ఇండస్ట్రీ వేరని, అదే విధంగా అదే రీతిలో ఈ పరిశ్రమ విస్తరిస్తుందని అనుకోకూడదని తెలిపారు. ప్రతి అంశం ఐటిలో చాలా వివరంగా, స్ట్రాంగ్‌గా ఉంటుందని తెలిపారు. ఐటిలో కొత్త కొత్త సెక్టార్స్‌లు విస్తరిస్తున్నాయన్నారు. రాబోయే కాలం అంతా ఐవోటీదేనన్నారు. ట్రెడిషనల్ నుంచి అడ్వాన్స్ కోర్సులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే కాలంలో ఐవోటీదే పైచేయని, ముఖ్యమంత్రి కూడా పదే పదే ఐవోటి గురించి చెపుతున్నారన్నారు. సైబర్, బయోటిక్, డేటా సేఫ్ వంటి కోర్సులు కీలకంగా మారనున్నాయన్నారు. ఈ యూనివర్సిటీ ప్రపంచంలోనే మొదటిది కాబోతుంది.