ఆంధ్రప్రదేశ్‌

పిహెచ్‌సిల్లో అపోలో సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 1: ప్రజా ఆరోగ్యం పరిరక్షణ చర్యల్లో భాగంగా పట్టణ పేదలకు వైద్యసేవలందించేందుకు ప్రాథమిక ఆరోగ్య టెలిమెడిసిన్ సదుపాయాలందించేందుకు సర్వీర్ ప్రొవైడర్‌గా అపోలో హాస్పిటల్ సహకారం తీసుకున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం తిరుపతిలో మునిసిపల్ పాఠశాలకు అనుసంధానంగా ఉన్న ప్రాథమిక వైద్యకేంద్రంలో ఎలక్ట్రానిక్ అర్బన్ ప్రైమరీ హెల్త్‌కేర్‌సెంటర్ ( ఇయుపిహెచ్‌సి) కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపోలో సహకారంతో తొలి ఇయ పిహెచ్‌సి కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించామని, రెండవది తిరుపతిలో ప్రారంభిస్తామన్నారు. రాబోయే కొద్దినెలల్లో 222 ఇయుపి హెచ్‌సి సెంటర్లను ప్రారంభించనున్నామని తెలిపారు. అపోలో సహకారంతో నిరుపేదలకు రక్తపరీక్ష దగ్గర నుంచి హెచ్ ఐ వి పరీక్షల వరకు సుమారు 29 వైద్యపరీక్షలను ఉచితంగా అందిస్తామన్నారు. ఈ పరీక్షలను పేదవారు ప్రైవేటు ల్యాబొరేటరీలో చేసుకోవాలంటే 3,600 రూపాయలు, కార్పొరేట్ ఆసుపత్రిలో అయితే రూ.9వేల వరకు ఖర్చవుతుందని ఆయన చెప్పారు. దేశంలోనే మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యసేవలను డిజిటలైజేషన్ ద్వారా అర్బన్ ప్రైమరీ సెంటర్లను, ఇయు పి హెచ్‌సిలుగా అప్‌డేట్ చేసే ప్రక్రియ చేపట్టిందన్నారు. ఈ కేంద్రాల్లో వైద్య పరీక్షలు చేసుకునేవారికి అపోలో ఆసుపత్రి వైద్యులు పరిశీలించి తగిన మందులను ప్రాథమిక కేంద్రంలో ఉన్న డాక్టర్లు, నర్సులద్వారా సేవలను అందిస్తారన్నారు. అపోలో హాస్పిటల్ సిఇఓ విక్రమ్‌తాప్లూ మాట్లాడుతూ దేశంలో మరికొన్నిరాష్ట్రాల్లో కూడా ఇలాంటి వాటిని ఏర్పాటుచేస్తామన్నారు.