ఆంధ్రప్రదేశ్‌

మిస్సమ్మ బంగ్లా కేసులో ‘వైఎస్’ ప్రస్తావన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: అనంతపురంలోని మిస్సమ్మ బంగ్లా కేసులో మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు అధికార పార్టీ ప్రస్తావించడంతో ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార, ప్రతిపక్షం మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు ఈ నెలాఖరుకు పూర్తవుతుందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప ఈ సందర్భంగా శాసనసభలో ప్రకటించారు. ఈ కేసు విచారణ సిఐడి విభాగం చేపట్టిందని, విచారణ నివేదిక అందగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి శాసనసభ్యుడు వి.ప్రభాకర్‌చౌదరి అడిగిన ప్రశ్నకు హోంమంత్రి సమాధానం చెప్పారు. 2015లో సిఐడి స్వాధీనం చేసుకున్న కేసులు 115, పరిష్కరించినవి 72, 2015 డిసెంబర్ 31 నాటికి 395 కేసులు దర్యాప్తులో ఉన్నట్లు వివరణ ఇచ్చారు. మిస్సమ్మ బంగ్లా కేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. అనంతపురం బస్టాండ్‌కు పక్కనే ఉన్న అత్యంత విలువైన మిస్సమ్మ బంగ్లా భూములు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన అనుచరులే ఆక్రమించారని ప్రభాకర్‌చౌదరి అన్నారు. ఇందుకు వైఎస్‌ఆర్‌సిపి సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని వారి గురించి మాట్లాడ్డం, వారిపై బురదచల్లడం ఏమిటని ప్రశ్నించారు. టిడిపి అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, వైఎస్ కుటుంబం అండ చూసుకునే దురాక్రమణకు పాల్పడ్డారని అన్నారు. ఇందుకు తగిన అన్ని ఆధారాలు ఉన్నందున ఇకనైనా నీతివచనాలు వదిలి ఆచరణలో చూపిస్తే ఆ దేవుడు క్షమిస్తాడని వైఎస్‌ఆర్‌సిపి నేత జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో వైఎస్ జగన్ ఎందుకు వౌనం వహిస్తున్నారో అర్ధం కావడం లేదని, ఆయన స్పందిస్తే బాగుంటుందని చెప్పారు.
వెంటనే జగన్ లేచి విచారణ మీ ప్రభుత్వమే చేస్తోంది, ఏవో నిజాలు ఉన్నాయంటున్నారు కదా, వాటిని బయటపెట్టండని అన్నారు. అంతేకాని సభలో లేని వారి గురించి మాట్లాడ్డం భావ్యం కాదన్నారు. ఈ అంశం మైనార్టీ శాఖ పరిధిలోకి వస్తున్నందున ఆ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వివరణ ఇస్తూ 2004-09 మధ్య వైఎస్ హయాంలో ఈ స్ధలాన్ని ఆక్రమించుకున్నారని, రిజిష్ట్రేషన్ కూడా చేయించుకున్నారని అన్నారు. ఆ ప్రాంతంలో రూ.150 కోట్లతో హాస్పిటల్ నిర్మించేందుకు సిఎం చంద్రబాబు ప్రతిపాదించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ 7.60 ఎకరాల భూమి అక్కడ అన్యాక్రాంతమైందని, సిఐడి నివేదిక, కోర్టు తీర్పు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.