జాతీయ వార్తలు

పరిశుభ్రతలో ఏపి భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబరు 2: బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లు నిలవడం మంచి పరిణామం అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం నాడు రెండు స్వచ్ఛ భారత్ స్మారక స్టాంపులను వెంకయ్యనాయుడు, కేంద్ర టెలికాం మంత్రి మనో జ్ సిన్హా విడుదల చేశారు. అనంతరం వెంకయ్య నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ పరిశుభ్రత, పారిశుద్ధ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొన్న చర్చలు చాలా బాగున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం నగరాలలో నిత్యం వెలువడే వ్యర్థ పదార్ధాల నిర్వహణపై తీసుకొంటున్న చర్యలకు ప్రోత్సాహకంగా రూ.186 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ నిధులను ఒకే సారి విడుదల చేయడం ఇదే మొదటిసారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధిస్తున్న అద్భుత ప్రగతి కారణంగానే ఇది సాధ్యమయిందని ఆయన అన్నారు. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా గుజరాత్‌లో 170, ఏపీలో 110 పట్టణాలు పరిశుభ్రతలో స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. ఇది ఒక చరిత్రాత్మక సాధన అని ఆయన అన్నారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా గత రెండేళ్లలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 3.3 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, పట్టణ ప్రాంతాల్లో మరో 1.6 లక్షల మరుగుదొడ్లను నిర్మించడం జరిగిందన్నారు. ఇవేకాక మరో 6,030 సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు. దేశంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన పిలుపుతో తెలంగాణ రాష్ట్రం కూడా పరిశుభ్రత కోసం చర్యలు తీసుకొంటోందన్నారు. గుజరాత్‌లోని పోరుబందర్ జిల్లాను పూర్తి స్థాయిలో పరిశుభ్రత సాధించిన జిల్లాగా ప్రకటించినట్టు ఆయన తెలిపారు. మహాత్మాగాంధీ 147వ జన్మదినం సందర్భంగా ఆయన జన్మస్థలమైన పోరుబందర్‌ను పూర్తిస్థాయిలో పరిశుభ్రత సాదించిన జిల్లాగా ప్రకటించడం ఆయనకు అందించిన తాత్కాలిక కానుక అని, 2019లో శాశ్వత కానుకను అందజేస్తామని వెంకయ్య నాయడు చెప్పారు. పరిశుభ్రత విషయంలో దేశంలోని అన్ని ప్రాంతాలు పోటీపడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 405 నగరాలు బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగాప్రకటించామని, వచ్చే ఏడాది మార్చికల్లా మరో 334 నగరాలను బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగా ప్రకటించబోతున్నట్టు వెంకయ్యనాయుడు తెలిపారు.
chitram...
స్వచ్ఛ భారత్ స్మారక స్టాంపులను ఆదివారం విడుదల చేస్తున్న
కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హా. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తదితరులు