ఆంధ్రప్రదేశ్‌

ఆహార భద్రత ఎంతో ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: దేశ భద్రత ఎంత ముఖ్యమో, ఆహార భద్రత కూడా అంతే ముఖ్యమని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం ఇందిరా భవన్‌లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్ర్తీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో రఘువీరారెడ్డి ప్రసంగిస్తూ స్ఫూర్తి ప్రదాత, మహనీయుడు మహాత్మా గాంధీ అని చెప్పారు. లాల్‌బహదూర్ శాస్ర్తీ ప్రధాని అయిన సమయంలో దేశం ఎంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నదని, ఒకవైపు యుద్ధం, మరో వైపు ఆహార ధాన్యాల కొరత ఉండేదని అన్నారు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న శాస్ర్తీ జై జవాన్, జై కిసాన్ అన్నారని, దీంతో సైనికుల్లో, రైతుల్లో నూతనోత్సాహం కలిగిందని ఆయన వివరించారు. యుద్ధం ఏ దేశానికీ మంచిది కాదని అన్నారు. అందులో అభివృద్ధి చెందుతున్న మన దేశానికి అసలే మంచిది కాదని ఆయన తెలిపారు. ఉరీ ఘటనలో 19 మంది మన దేశ సైనికులు వీర మరణానికి ప్రతీకారంగా సర్జికల్ దాడి విజయవంతంగా నిర్వహించిన మన దేశ సైనికులను రఘువీరారెడ్డి అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపి కెవిపి రామచంద్రరావు, ఎపి శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య, మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ తదితరులు పాల్గొన్నారు.