ఆంధ్రప్రదేశ్‌

అరకొర వసతుల మధ్య అమరావతికి ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: అరకొర వసతుల మధ్య అంత అర్జంటుగా అమరావతికి పరుగులు తీయాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. సచివాలయాన్ని అమరావతికి తరలించడానికి తాము వ్యతిరేకం కాదనీ, అయితే పూర్తి వసతులు లేకుండా తరలించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత ఎపి రాజధానిలో ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేదని ఆయన విమర్శించారు. సింగపూర్, చైనా అంటూ కాలయాపన చేశారని ఆయన తెలిపారు. భూ సేకరణ, ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తుంటే పిడి చట్టాల కింద అణచి వేస్తున్నారని ఆయన విమర్శించారు. భీమవరం సమీపంలో ఆక్వాఫుడ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాగా లేదని అన్నారు. నియంత పాలనలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఎక్కడికి వెళ్లినా అక్కడ తమ పార్టీ నాయకులను నిర్బంధిస్తున్నారని అంబటి తెలిపారు.