ఆంధ్రప్రదేశ్‌

కాపులపై కేసులు పెడితే జైళ్లు సరిపోవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: ప్రజా ఉద్యమకారులు, ఆందోళనకారులపై పిడియాక్ట్ బనాయించి అణచివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడాన్ని కాపు రిజర్వేషన్ల పోరాటసమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఆక్షేపించారు. హైదరాబాద్‌లో తనను కలిసిన పాత్రికేయులతో మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులపై పిడి యాక్ట్ పెట్టాలని చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవని అన్నారు. జైళ్లకు, బెయిళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పోరాట భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు హైదరాబాద్ వచ్చిన ముద్రగడ పద్మనాభం వివిధ వర్గాల మేధావులను, బిసి సంఘాల నేతలను కలిశారు. తమ పోరాటం మిగతా బిసి వర్గాలకు వ్యతిరేకంగా చేస్తున్నది కాదని, వారి రిజర్వేషన్ల కోటాను తీసుకోవాలన్నది తమ అభిమతం కాదని స్పష్టం చేశారు. బిసి కమిషన్ చైర్మన్ మంజునాధ్‌కు ఇప్పటికే తమ సమస్యలను వివరిస్తూ మహాజర్లు ఇచ్చామన్నారు.నవంబర్‌లో చేపట్టబోయే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ముద్రగడ అన్ని వర్గాల ప్రజలను, పార్టీల నేతలను కోరారు.
రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన రిజర్వేషన్ల పోరాట సమితి జెఎసిల సమావేశం తీర్మానాలను చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు మంగళవారం నాడు కాపు ప్రముఖుల సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి ముద్రగడతో పాటు కాపు ప్రముఖులు, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు, ప్రముఖ నటుడు చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, వైఎస్సార్ నాయకుడు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, తోట చంద్రశేఖర్, అద్దేపల్లి శ్రీ్ధర్, నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, కఠారి అప్పారావు, సిహెచ్ జనార్ధన్ తదితరులు హాజరవుతారు. కాపు రిజర్వేషన్ల పోరాట సమితి భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర స్థాయి జెఎసి ఏర్పాటు వంటి అంశాలను సమావేశంలో చర్చిస్తారు.