ఆంధ్రప్రదేశ్‌

‘స్థానికం’లో విడిగానే సమరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: మిత్రపక్షాలైన తెదేపా-్భజపా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నేతల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతోంది. తమ అగ్రనేతలు కొందరు తెదేపాకు అమ్ముడుపోయి పార్టీని పణంగా పెడుతున్నారంటూ ఇప్పటివరకూ అంతర్గత వేదికపై ఆరోపణలు గుప్పించిన నేతలు, ఇప్పుడు రోడ్డెక్కారు. ఇలాగైతే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తమకు మొండి చేయి చూపిస్తారన్న అనుమానం వ్యక్తం చేసిన నేతల వద్ద, మీకు బలం ఉంటే మీరు సొంతగానే పోటీ చేయండని స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వైనం చర్చనీయాంశమయింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును ఆ జిల్లా పార్టీ నేతలు కలిశారు. గుంటూరు యార్డులో ఇద్దరికి డైరక్టర్ పదవులు ఇస్తామని చెప్పి తెదేపా నేతలు మోసం చేశారని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై తెదేపా నాయకత్వంతో మాట్లాడాలని కోరారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపా తమకు మొండిచేయి చూపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
దానికి స్పందించిన హరిబాబు ఈ విషయంలో తానేమీ చేయలేనని, మీకు స్థానికంగా బలం ఉంటే కార్పొరేషన్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయండని సూచించారు. అదేవిధంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి ‘మనం కూడా కేంద్రంలో టిడిపి వాళ్లకు పోస్టులు ఇవ్వడం లేదు కదా అని వ్యాఖ్యానించారు. వాళ్లు కూడా మనల్ని ఇదే మాట అడుగుతున్నారు. ఈ విషయంలో నేనేమీ చేయలేన’ని నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపాతో కలసి కాకుండా, విడిగానే పోటీ చేయాలని ఎన్నికలు జరుగుతున్న జిల్లాల పార్టీ కార్యవర్గాలు నిర్ణయించినట్లు సమాచారం. విశాఖ, గుంటూరులో తమకు బలమైన యంత్రాంగం ఉందని, కాకినాడలో కూడా అర డజనుకుపైగా స్థానాలు సాధించే శక్తి ఉందంటున్నారు. తిరుపతిలో సగం డివిజన్లలో బలమైన యంత్రాంగం ఉందని చెబుతున్నారు.
ముఖ్యంగా విశాఖలో రాష్ట్ర అధ్యక్షుడు-ఎంపి, ఎమ్మెల్యే కూడా ఉన్నందున ఎట్టి పరిస్థితిలోనూ సొంతంగా పోటీ చేయాల్సిందేనని పట్టుపడుతున్నారు. గతంలో పొత్తు లేనప్పుడే తాము కార్పొరేషన్ సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గుంటూరులో వ్యక్తిగత ఇమేజ్, కులబలం, సొంత యంత్రాంగం ఉన్న సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే ఆ పార్టీని ఒంటిచేత్తో గెలిపించి, కొడుకును మేయర్‌గా కూడా గెలిపించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కన్నా బిజెపిలో ఉన్నందున ఆయన ఇమేజ్‌తోపాటు పార్టీ బలం కూడా కలసి కనీసం 20-30 సీట్లు సాధించే శక్తి ఉందని వాదిస్తున్నారు. ఇటీవలి కాలంలో తిరుపతి, కాకినాడలో కూడా బిజెపి బాగా బలపడిందని చెబుతున్నారు.
తెదేపాతో పొత్తు పెట్టుకుంటే తాము విస్తరించే అవకాశాలు ఉండవని పార్టీ జిల్లా శాఖలు స్పష్టం చేస్తున్నాయి. ఆ పార్టీ ఇచ్చే ఐదారు సీట్ల కోసం తాము పార్టీని పణంగా పెట్టాల్సిన పని లేదని, సొంతంగా పోటీ చేసి తన సత్తా ఏమిటో చూపించాల్సిన అవసరం ఉందంటున్నారు. విడిగా పోటీ చేస్తే కనీసం కార్యకర్తలకు అవకాశం ఇచ్చినట్టయినా ఉంటుందంటున్నారు. ఎలాగూ నామినేటెడ్ పదవులివ్వడం లేదు కాబట్టి, ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చామన్న పేరయినా మిగులుతుందని జిల్లా పార్టీ కార్యవర్గాలు భావిస్తున్నాయి.
నామినేటెడ్ పదవుల విషయంలో తెదేపా తమను చిన్నచూపు చూడటంపై బిజెపి నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయ కమిటీలో తమకు స్థానం కల్పించని వైనంపై ఆగ్రహించిన బిజెపి నేతలు, బెజవాడ పార్టీ కార్యాలయంలో బైఠాయించడం సంచలనం సృష్టించింది. తమ రాష్ట్ర నేతలు కొందరు తెదేపాకు అమ్ముడుపోయి, పార్టీని పణంగా పెట్టినందుకే ఈ అన్యాయం జరిగిందని, మంత్రులు రాజీనామా చేసి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఏపిలో సగటు బిజెపి కార్యకర్త మనోభావన కూడా ఇదేవిధంగా ఉంది. ఒక వర్గం నేతలు పార్టీని తెదేపాకు తాకట్టు పెట్టారని, అందుకే రాష్ట్రంలో బిజెపి బలపడటం లేదన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది.