ఆంధ్రప్రదేశ్‌

నీటి భద్రతతో పాటే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ నీటి భద్రతతోపాటు నీటి బాధ్యత కూడా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నీరు-ప్రగతిపై వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇంకా వర్షపాతం లోటు 6 శాతం ఉందని, నీరు ప్రగతి వల్లే భూగర్భ జలమట్టం గత ఏడాది కన్నా ప్రస్తుతం రెండు మీటర్లు పెరిగిందని పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నిండాలంటే ఇంకా 12 టిఎంసిలు రావాలని, నాగార్జున సాగర్ నిండాలంటే ఇంకా 142టిఎంసిలు రావల్సి ఉందని పేర్కొన్నారు. కృష్ణా నదిలో ఎగువ నీటి ప్రవాహం లేకున్నా దిగువ నీటి ప్రవాహాల వల్ల పులిచింతల నిండిందని, దీంతో కొంతవరకూ మన చింత తీరిందని అన్నారు. రాయలసీమ జిల్లాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. వరదలు వచ్చినపుడు నీటిని కాపాడుకోవాలని, కరవులో ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలని, నీటి ప్రణాళిక అతిముఖ్యమైన అంశంగా అందరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. సాగునీటికి, తాగునీటికి సంబంధించి గ్రామాల వారీ నీటి ప్రణాళికలు రూపొందించుకుని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. మనం -వనం ఉత్సాహంతో నగరవనం కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా చేపట్టాలని సిఎం ఆదేశించారు. నాటిన మొక్కల్లో 56 లక్షల మొక్కలకు జియోట్యాగింగ్ మొదలైందని చెప్పారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ లక్ష్యం 1.45 లక్షల ఎకరాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇంతవరకూ 14.7 లక్షల బోర్‌వెల్స్ జియోట్యాగింగ్ పూర్తి చేశారని, టార్గెట్‌లో 98 శాతం పూర్తి చేశారని మిగిలినవి కూడా పది రోజుల్లో పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. మరో రెండేళ్లలో రాష్టవ్య్రాప్తంగా 100 శాతం ఒడిఎఫ్ కావాలని అన్నారు. పాలనా సంస్కరణల్లో భాగంగా రెవిన్యూ డివిజన్లను పటిష్టం చేస్తున్నట్టు సిఎం చెప్పారు. ఆర్‌డిఓలకు విస్తృతాధికారాలు కల్పించడం పాలనా సంస్కరణల్లో భాగమేనని అన్నారు. రెవిన్యూ డివిజన్ల తరహాలోనే మండలాలు, గ్రామాల మధ్య పోటీతత్వం పెరగాలని సిఎం సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం, మెరుగైన శ్రద్ధ, మేలైన విధానాలు పంచుకోవడమే టెలికాన్ఫరెన్స్‌ల ఉద్ధేశంగా సిఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు రామాంజనేయులు, దినేష్‌కుమార్, పివి రమేష్, జవహర్‌రెడ్డి, వేంకటేశ్వర్లు, శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.