ఆంధ్రప్రదేశ్‌

నామినేటెడ్ పదవుల్లో బిజెపికి మొండిచెయ్యి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 3: వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన నామినేటెడ్ పదవుల పందారంలో, ముఖ్యంగా బిజెపికి చెందిన మాణిక్యరావు నిర్వహిస్తున్న దేవాదాయ శాఖకు సంబంధించి విజయవాడ దుర్గగుడి, అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయ పాలకవర్గాల్లో పార్టీ కార్యకర్తల్లో ఏ ఒక్కరికీ స్థానం లభించకపోవటంపై బిజెపి కార్యకర్తలు ఆగ్రహోదగ్రులయ్యారు. దీన్ని ముందే గుర్తించిన మంత్రి మాణిక్యరావు దసరా ఉత్సవాలు ప్రారంభమైనా నగరంలోకి అడుగిడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఆదివారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉన్నప్పటికీ హాజరుకాలేదు. బిజెపి నగర అధ్యక్షులు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ ప్రాంగణంలో దసరా మహోత్సవాలు ప్రారంభమైన మూడోరోజు దాసం దంపతుల ఆధ్వర్యంలో పూజలు జరుగుతుండటంతో ఆయన ఆహ్వానం మేరకు నగరం నలుమూలల నుంచి దాదాపు 200 మందికి పైగా పార్టీ, దళిత మోర్చా, మైనార్టీ మోర్చా, మహిళా మోర్చా, బిసి సెల్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పూజల తర్వాత వారంతా డాక్టర్ దాసంతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆయన వెంట సీనియర్ నాయకులు ఎల్‌ఆర్‌కె ప్రసాద్, మాలకొండయ్య, తదితరులు ఉన్నారు. వీరెవరూ బైటకు వెళ్లటానికి వీలులేకుండా ప్రధాన గేటుకి తాళాలు వేశారు. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ ఒక్క నామినేటెడ్ పదవి కూడా దక్కకపోతే పార్టీలో ఎందుకు కొనసాగాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెచ్చిపోయి కుర్చీలు, ఫర్నిచర్‌ను నేలపై విసిరికొట్టి ధ్వంసం చేశారు. కార్యాలయానికి తాళాలు వేశారు. పోలీసులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అయినప్పటికీ కార్యకర్తల్లో ఆవేశం చల్లారకపోవడంతో డాక్టర్ దాసం నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ రాష్ట్ర నేతలతో మాట్లాడదామని చెప్పగా కార్యకర్తలు రగిలిపోయారు.