తూర్పుగోదావరి

పది పిల్లలకు జన్మనిచ్చిన డాబర్‌మెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, మార్చి 26: శంకరగుప్తం గ్రామానికి చెందిన ఎడ్ల రాజేష్‌కు చెందిన డాబర్‌మెన్ కుక్క శనివారం పది పిల్లలకు జన్మనిచ్చింది. లక్షా యాభైవేల వ్యయంతో ఈ డాబర్‌మేన్ కుక్కను యుకె నుండి తెప్పించుకున్నామని, గతంలో ఈ కుక్క ఇరు పిల్లలకు జన్మనివ్వగా ఈ సంవత్సరం పది పిల్లలకు జన్మనిచ్చిందని రాజేష్ తెలిపాడు.

ఉన్నత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
క్రికెటర్ వేణుగోపాలరావు పిలుపు

కాకినాడ, మార్చి 26: ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు క్రీడలలో కూడా రాణించేందుకు కృషి చేయాలని అంతర్జాతీయ క్రికెటర్ వై వేణుగోపాలరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం కాకినాడలోని జెఎన్‌టియుకె అలూమినీ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన క్రీడా దినోత్సవానికి వేణుగోపాలరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఉన్నత సాంకేతిక విద్యార్థులు క్రీడలల్లో అనురక్తితో సాగాలని, క్రీడల ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం ఉన్నదన్నారు. చదువుకు క్రీడలు కూడా తోడైతే భవిష్యత్‌లో ఎన్నో ఉపయోగాలుంటాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి ఒక క్రీడాకారుడిగా ఎదిగితే అందులో ఉండే ఆనందమే వేరని ఆయనన్నారు. క్రీడాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని కోరారు. విద్యార్థులను విశ్వ విద్యాలయాలు క్రీడల్లో నిరంతరం ప్రోత్సహించాలని వేణుగోపాలరావు విజ్ఞప్తి చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్సిటీ రెక్టార్ ఆచార్య బి ప్రభాకరరావు ప్రసంగిస్తూ జెఎన్‌టియుకె విద్యార్థులు క్రీడలలో రాణిస్తున్నారని, వర్సిటీ కూడా అటువంటి విద్యార్థులను ప్రత్యేకించి ప్రోత్సహిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బహుళ జాతి సంస్థలు కూడా తమ ఉద్యోగులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుచేస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెఎన్‌టియుకె రిజిష్ట్రార్ ఆచార్య జివిఆర్ ప్రసాదరాజు మాట్లాడుతూ క్రీడలలో వర్సిటీ విద్యార్థులు రాణించాలని కోరారు. డాక్టర్ రామచంద్రరాజు సభకు అధ్యక్షత వహించారు. డాక్టర్ పద్మరాజు, డాక్టర్ కోటేశ్వరరావు, వివిధ విభాగాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. సభకు ముందు రెక్టార్ ప్రభాకరరావు, వేణుగోపాలరావు తదితరులు జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అప్పనరామునిలంక వ్యాయామోపాధ్యాయుడు సస్పెన్షన్

అమలాపురం, మార్చి 26: సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యాయామోపాధ్యాయుడు సస్పెన్షన్‌కు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పనరామునిలంక హైస్కూలు వ్యాయామోపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు మహిళా ఉపాధ్యాయులు, హెచ్‌ఎం ప్రకాశరావుకి ఇటీవల ఫిర్యాదు చేయడంతో ఈ విషయాన్ని హెచ్‌ఎం లిఖితపూర్వకంగా జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులు విచారణ చేపట్టగా వాస్తవాలు వెలుగుచూడటంతో వ్యాయామోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు.

టెన్త్ ఇంగ్లీషు-2 ప్రశ్నాపత్రంలో పొరపాటుతో విద్యార్థుల్లో ఆందోళన

రాయవరం, మార్చి 26: టెన్త్ విద్యార్థులు శనివారం నాటి ఇంగ్లీషు-1 ప్రశ్నాపత్రాన్ని చూసి ఒకింత కలవరపాటుకు గురయ్యారు. ఇంగ్లీషు-1 ప్రశ్నాపత్రంలో రెండు మార్కుల ప్రశ్నలో తప్పు ఇవ్వడంతో విద్యార్థులు తికమకలకు గురయ్యారు. ఇంగ్లీషు పేపర్లో 13వ ప్రశ్నలో ‘అవర్ ఫాదర్ సోల్ కెనాట్ రెస్ట్ ఇన్ పీస్ అన్‌లెస్ ఉయ్ డూ దిస్?’ అనే ప్రశ్న ఇవ్వగా ఈ ప్రశ్న ది స్టోరీడ్ హౌస్-2 అన్న పాఠ్యాంశంలోనిది కాగా ప్రశ్నాపత్రంలో ది డియర్ డిపార్టెడ్ -2 అనే పాఠ్యాంశానికి చెందినదిగా ఇవ్వడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. అయితే ఈ రెండు మార్కులు విద్యార్థులు కోల్పోకుండా ఎస్‌ఎస్‌సి బోర్డు తగు చర్యలు తీసుకోవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.