తెలంగాణ

పోలీసు శాఖలో పునర్వ్యవస్థీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణలో పోలీస్ శాఖ కూడా పునర్వ్యవస్థీకరణ కావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. కొత్తగా వచ్చే జిల్లాలు, డివిజన్లు, మండలాల ఆధారంగా పోలీస్ శాఖ కూడా తమ కార్యాలయాలను దసరా రోజునే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్‌తోపాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు డిజిపి కార్యాలయంలో పోలీస్ శాఖ పునర్వ్యవస్థీకరణపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయంటే.. అది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేనని, ఇందుకు తానెంతో గర్వపడుతున్నానని హోం మంత్రి ఈ సందర్భంగా అన్నారు.
రాష్ట్రంలో కొత్తగా మరో 82 పోలీస్ స్టేషన్లు అవసరమన్నారు. మరో వారం రోజుల్లో జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెరుగుతున్నందున పోలీస్ సిబ్బంది నియామకాలు పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. పెద్ద జిల్లాలకు సీనియర్ అధికారులను, చిన్న జిల్లాలకు కొద్దిగా కింది స్థాయి అధికారులను నియమించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. డిజిపి అనురాగ్ శర్మ మాట్లాడుతూ, జిల్లాల సంఖ్య పెరిగే కొద్ది సిబ్బందిని సర్దుతున్నామని, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 118 కొత్త మండలాలు ఏర్పడడం వల్ల 82 నూతన పోలీస్ స్టేషన్‌లు, 23 సర్కిళ్లు, 22 సబ్ డివిజన్ల ఆవశ్యకత ఏర్పడిందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్‌లు ఏర్పాటు చేయాలని, మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం ఏరియాలు పెద్దవిగా ఉండడంతో అక్కడ ఐజి స్థాయి అధికారిని కమిషనర్‌గా నియమించాలని అనుకుంటున్నట్టు డిజిపి తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఎనిమిది కమిషనర్ కార్యాలయాలు ఉంటాయని తెలిపారు. గత కొన్ని రోజులుగా జిల్లా ఎస్పీలు, సీనియర్ అధికారులతో ఈ విషయమై చర్చించిన విషయాలను, నూతన పోలీస్ స్టేషన్ల ఆవశ్యకతను, సిబ్బంది నియామక అవసరాలను హోం మంత్రికి డిజిపి వివరించారు.

డిజిపి కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న హోంమంత్రి నాయిని.
పక్కన డిజిపి అనురాగ్‌శర్మ, కమిషనర్ మహేందర్‌రెడ్డి. పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్